ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న మూడు సినిమాల్లో ఓజి కూడా ఒకటి. పవన్ కు పెద్ద అభిమాని అయిన సుజీత్ తీస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ఆల్మోస్ట్ 80 శాతానికి పైగా పూర్తి చేసుకుంది.
ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. మరోవైపు కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. అటు పవన్ ఓజి పై అలానే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.
కాగా మ్యాటర్ ఏమిటంటే, కొన్ని విషయాల్లో ఈ రెండు సినిమాల మధ్య పలు పోలికలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రెండు సినిమాలు కూడా గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీస్ గా రూపొందుతున్నాయి. అలానే వీటిలో హీరో ఒకప్పటి మాఫియా గ్యాంగ్ స్టర్ గా ఉంటాడు, అనంతరం తన గతాన్ని విడిచి సాదాసీదాగా బ్రతకడం, అనంతరం కొన్ని కారణాల రీత్యా మళ్ళి గత విధానాలు అనుసరించడం అనేది ఒకే విధంగా ఉంటుందట.
మరోవైపు గుడ్ బ్యాడ్ అగ్లీ నుండి ఫస్ట్ సాంగ్ ఓజి సంభవం నేడు రిలీజ్ కానుంది. అటు ఓజి పై ఇటు గుడ్ బ్యాడ్ అగ్లీ పై తెలుగు, తమిళ భాషల ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.
అలానే అటు పవన్, అజిత్ లని ఇష్టపడే అభిమానులు కూడా కొందరు ఉన్నారు. కాగా వీటిలో ముందుగా ఏప్రిల్ 10న గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ కానుండగా ఓజి మూవీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.