దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘సైమా’ అవార్డులను (SIIMA – సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) చాలా ప్రతిష్ఠాత్మకంగా మరియు గౌరవంగా భావిస్తుంటారు. 2012 నుండి ప్రతీ ఏడాది అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ మరియు కన్నడ భాషల్లో నుంచి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన నటీనటుల్ని సినిమాలను గుర్తించి వారికి వివిధ విభాగాల్లో అవార్డులు SIIMA వారు ప్రధానం చేస్తూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సైమా-2022 అవార్డుల కార్యక్రమం ఈ ఏడాది బెంగళూరులో జరుగుతోంది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకను ఎప్పటిలాగే కళ్ళు చెదిరే విధంగా భారీ స్థాయిలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఈ ఈవెంట్ లో దక్షిణ భారత సినీ రంగంలోని దాదాపు స్టార్స్ అందరూ హాజరయ్యారు.
లోకనాయకుడు కమల్ హసన్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – కన్నడ రాకింగ్ స్టార్ యష్ – రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ‘సైమా’ అవార్డ్స్ కార్యక్రమంలో విచ్చేసి ఈ ఈవెంట్ ను భారీ స్థాయిలో విజయవంతం చేశారు.
సైమా వారు 10వ ఎడిషన్ అవార్డ్స్ 2021లో విడుదలైన చిత్రాలకు ప్రదానం చేయనున్న సంగతి తెలిసిందే. నామినేషన్స్ విషయానికి వస్తే.. తెలుగులో ‘పుష్ప: ది రైజ్’ చిత్రం అత్యధిక నామినేషన్లు సాధించగా.. మొత్తం ఎవరెవరికి ఏ అవార్డులు వచ్చాయో చూద్దాం.
ఉత్తమ చిత్రం – పుష్ప
ఉత్తమ నటుడు (ప్రేక్షకులు) – అల్లు అర్జున్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – బాలకృష్ణ
ఉత్తమ నటుడు (డెబ్యూట్) – వైష్ణవ్ తేజ్
ఉత్తమ నటి (ప్రేక్షకుల చాయిస్) – సాయి పల్లవి
ఉత్తమ నటి (డెబ్యూట్) – కృతి శెట్టి
ఉత్తమ దర్శకుడు – సుకుమార్ మరియు బుచ్చిబాబు
2021లో అల వైకుంఠపురములో సినిమాకి ఇదే అవార్డు సాధించిన తర్వాత పుష్ప సినిమాతో వరుసగా రెండోసారి ఈ అవార్డును అల్లు అర్జున్ ఈ అవార్డును గెలుచుకున్నారు. కాగా ఈ అవార్డు అందుకున్నందుకు అల్లు అర్జున్ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలుపుతూ తన పై ప్రేమను కురిపించినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
#SIIMA2022 కు ధన్యవాదాలు తెలుపుతూ.. మరోసారి ఉత్తమ నటుడిగా ప్రజల ఆశీర్వాదం అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డును ఒకసారి పొందడమే ఒక కల అనుకుంటే అది రెండోసారి కూడా రావడం వల్ల నన్ను నేను నిజంగా చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. అందరి ప్రేమకు ధన్యవాదాలు అని అల్లు అర్జున్ రాశారు.
సైమా అవార్డులను ఆన్ లైన్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. దీని కోసం www.siima.in వెబ్ సైట్ లేదా సైమా అఫిషియల్ ఫేస్ బుక్ పేజీలో ఓటింగ్ నిర్వహిస్తారు.