తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో సమయంలో ఒక్కో హీరోయిన్ హవా నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆ దశలో నవ సంచలనం యువ నటి శ్రీలీల ఉంది. అందమైన మోముకు తోడు ఆకర్షణీయమైన నవ్వు మరియు శరీర సౌష్టవంతో ప్రస్తుతం అటు ప్రేక్షకులను కట్టి పడేశారు శ్రీలీల. కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడి చిత్రంతో శ్రీ లీల తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. మరియు తొలి చిత్రంతోనే విశేష ఖ్యాతి పొందారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని పెద్ద సినిమాలలో కనిపించబోతున్నారని సమాచారం.
ఇప్పటికే క్రేజీ లైనప్ ను సిద్ధం చేస్తున్న శ్రీలీల, ఆమె మరో భారీ ప్రాజెక్ట్‌కు సంతకం చేసారు. ఈ ఏడాది సూపర్ హిట్లలో ఒకటైన డీజే టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్ గా కనిపించనున్నారు. సినిమా మొదటి భాగం భారీ హంగామా సృష్టించింది. అందువల్ల సీక్వెల్ కూడా ఖచ్చితంగా అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.
అంతే కాకుండా మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా చిత్రంలో కూడా నటిస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి మరియు నందమూరి బాలకృష్ణ కలిసి చేసే సినిమాలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. ఈ సినిమాలో ఆమె బాలయ్య కూతురి పాత్రలో నటిస్తున్నారట.
శ్రీ లీల వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాబోయే బిగ్ స్టార్ గా మారే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆమె సరైన స్క్రిప్ట్‌లను ఎంచుకుని, సరైన సినిమాలు చేసుకుంటే, ఖచ్చితంగా టాప్ హీరోయిన్ అవుతారు అవడంతో ఎలాంటి సందేహం లేదు.
పెళ్లి సందడి చిత్రంలో హీరో రోషన్ తో జోడీగా కనిపించిన శ్రీలీల చక్కని హావభావాలతో మరియు లయభద్దమైన నృత్య భంగిమలతో ఆకట్టుకున్నారు. ఇక యూత్ ను ఒక ఊపు ఊపేసిన డీజే టిల్లు సినిమాలో హీరోగా సిద్దు జొన్నలగడ్డతో పాటు హీరోయిన్ పాత్రలో రాధికగా నేహా శెట్టికి కూడా చక్కని క్రేజ్ వచ్చింది. మరి సీక్వెల్ లో శ్రీ లీల ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.