Homeసినిమా వార్తలుShocking Runtime for Pushpa 2 'పుష్ప - 2' కి షాకింగ్ రన్ టైం

Shocking Runtime for Pushpa 2 ‘పుష్ప – 2’ కి షాకింగ్ రన్ టైం

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే పుష్ప 2 నుండి రిలీజ్ అయిన సాంగ్స్ తో పాటు థియేట్రీకల్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల జరిగిన పుష్ప 2 కి సంబంధించి జరిగిన రెండు ఈవెంట్స్ కి భారీగా రెస్పాన్స్ లభించింది. విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క రన్ టైం తాజాగా లాక్ అయినట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2 మూవీ 3 గం. 15 ని. ల పాటు సాగనుందట.

అయితే ఇంత భారీ రన్ టైం పుష్ప 2 మూవీకి ఇబ్బంది అని కొందరు అంటుంటే, గతంలో ఆనిమల్ వంటి మూవీస్ కి ఈ స్థాయి భారీ రన్ టైం ఉన్నప్పటికీ కంటెంట్ బాగుండడంతో అది మూవీ సక్సెస్ పై పెద్దగా సక్సెస్ చూపలేదని మరికొందరు అంటున్నారు. అయితే పుష్ప 2 కంటెంట్ పై మేకర్స్ ఎంతో గట్టి నమ్మకంతో ఉన్నారు. మరోవైపు ఈ మూవీ యొక్క బెనిఫిట్ షోస్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రేపు పుష్ప 2 ఈవెంట్ కేరళలోని కొచ్చిలో జరుగనుంది.

READ  Kamal versus Prabhas Boxoffice Clash ప్రభాస్ vs కమల్ : భారీ బాక్సాఫీస్ క్లాష్ ఫిక్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories