అఖిల్ అక్కినేని స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ ఏప్రిల్ 28 నుండి థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది, ఈ చిత్రం అఖిల్ కెరీర్ కు చాలా కీలకం. ఈ సినిమా విజయం పై అఖిల్ తో పాటు ఆయన అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఏజెంట్ ఫలితం అఖిల్ కెరీర్ పై భారీ ప్రభావం చూపుతుందని, ఇండస్ట్రీలో తన రాబోయే ప్రయాణానికి ఇది చాలా కీలకమైన, టర్నింగ్ పాయింట్ అని అంటున్నారు.
ఇక ఇప్పటికే పలు ప్రాంతాల్లో మొదలైన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నిరాశాజనకంగా, పేలవంగా ఉన్నాయి. నిజానికి ఈ సినిమా బడ్జెట్ ను గనక పరిగణనలోకి తీసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ పేలవంగా ఉండటంతో ఇప్పుడు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చే నోటి మాటే చాలా కీలకం కానుంది.
అయితే ఈ సినిమా గురించి అఖిల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. అడవి కోతిలా ప్రవర్తించే పాత్రలో తాను కనిపిస్తానని, ఈ సినిమా పూర్తిగా హీరో క్యారెక్టర్ తో నడిచేది కాదని చెప్పారు. మూడు పాత్రల మధ్య ఇంటెన్స్ డ్రామా ఉంటుందని, మరీ ముఖ్యంగా ప్రతి పాత్రకు గౌరవం ఉంటుందన్నారు. అంతర్జాతీయ గూఢచారి సమస్యలతో ముడిపడి ఉన్నందున ఏజెంట్ ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ సుంకర, పాటి దీపారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ చేసిన ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.