Homeసినిమా వార్తలుPathaan: తమ సినిమా రికార్డులను బద్దలు కొట్టిన పఠాన్ టీంను అభినందించిన బాహుబలి 2 నిర్మాత...

Pathaan: తమ సినిమా రికార్డులను బద్దలు కొట్టిన పఠాన్ టీంను అభినందించిన బాహుబలి 2 నిర్మాత శోభు యార్లగడ్డ

- Advertisement -

తమ సినిమా బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టి అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచినందుకు నిర్మాత శోభు యార్లగడ్డ శనివారం షారుఖ్ ఖాన్ ను, పఠాన్ చిత్ర బృందాన్ని అభినందించారు. షారుఖ్ ఖాన్ రీఎంట్రీ చిత్రం అయిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను బద్దలు కొట్టింది, ముఖ్యంగా అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.

భారత్ నుంచి రూ.511 కోట్ల నెట్ వసూళ్లతో పఠాన్ గత కొన్నేళ్లుగా బాహుబలి-2 పేరిట ఉన్న రికార్డుని అధిగమించింది. 2017లో రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశం నుంచి రూ.510.99 కోట్లు రాబట్టింది. పఠాన్ ఈ. రికార్డ్ బద్దలు కొట్టే వరకు ఈ చిత్రం వరుసగా ఐదేళ్ల పాటు ఈ రికార్డును నిలబెట్టుకుంది. హిందీ గ్రాసర్ల లిస్ట్ లో పఠాన్ ర్యాంకింగ్ గురించి, బాహుబలి 2, కెజిఎఫ్ 2, దంగల్ కలెక్షన్లను అధిగమించడం గురించి తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ ను శోభు షేర్ చేశారు.

https://twitter.com/Shobu_/status/1631979872632578049?t=k1KPe02TqlEuIZBOXa472A&s=19

శోభు ట్వీట్ ను షారుక్ ఖాన్ అభిమానులు, దక్షిణ భారతదేశంలోని ఇతర నెటిజన్లు స్వాగతించారు. హ్యాట్సాఫ్ మరియు ఇతర ఎలివేటింగ్ పదాలు చెప్పి ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు పఠాన్ విజయాన్ని జీర్ణించుకోలేని కొందరు బాలీవుడ్ ఇండస్ట్రీ వ్యక్తుల పై విమర్శలు కూడా గుప్పించారు.

READ  Pathaan: పఠాన్ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్- ఆల్ టైమ్ రికార్డ్

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ చిత్రం ద్వారా నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. విడుదలకు ముందే ఈ సినిమాపై విపరీతమైన హైప్ ఏర్పడింది. ఇక విడుదలయిన మొదటి రోజు నుంచే అత్యధిక ఓపెనింగ్ డే, వీకెండ్, వీక్ ఇలా ఎవరూ ఊహించని ఎన్నో మైలురాళ్లను అందుకుంది.

పఠాన్ చిత్రం YRF స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన సినిమా. ఇందులో దీపికా పదుకునె మరియు జాన్ అబ్రహం కూడా కీలక పాత్రల్లో నటించారు. అలాగే బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ఒక అద్భుతమైన మరియు ప్రేక్షకులను ఆకట్టుకునే అతిథి పాత్రలో నటించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Pathaan: తెలుగు, తమిళ సినిమాల కంటే హిందీ మార్కెట్ ఇప్పటికీ పెద్దదని నిరూపించిన పఠాన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories