దిగ్గజ దర్శకుడు శంకర్ ఇటీవల తన దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ మూవీస్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి బ్యాక్ టూ బ్యాక్ భారీ డిజాస్టర్స్ సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమాల అనంతరం దర్శకుడిగా ఆయన పై కొంత నెగటివ్ ముద్ర పడింది.
దానితో ప్రస్తుతం కమల్ తో తీస్తున్న ఇండియన్ 3 ని థియేటర్స్ లో రిలీజ్ చేసి పెద్ద విజయం సొంతం చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు శంకర్. మరోవైపు ఈ మూవీ అనంతరం వేల్పరి మూవీని గ్రాండ్ గా తెరకెక్కిద్దాం అనుకున్న ఆయన ఆలోచనలు ఇప్పట్లో లేనట్లే అని టాక్.
మరోవైపు తాజాగా స్టార్ నటుడు చియాన్ విక్రమ్ ఇటీవల శంకర్ ని కలిసి తన కుమారుడు ధృవ్ విక్రమ్ తో ఒక మూవీ చేయమని ఆయనని కోరినట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయమై ఆలోచన చేస్తున్న శంకర్, త్వరలో ధృవ్ తో మూవీ చేసే అవకాశం ఉందని టాక్.
ఫస్ట్ మూవీ ఆదిత్య వర్మతో మంచి పేరు అందుకున్నారు ధృవ్ విక్రమ్. ప్రస్తుతం కర్ణన్ దర్శకుడు మరి సెల్వరాజ్ తో తన నెక్స్ట్ మూవీ చేసేందుకు సిద్దమవుతున్నాడు. మరి ధృవ్ తో శంకర్ మూవీ చేస్తారా లేదా అనే దానిపై క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.