Homeబాక్సాఫీస్ వార్తలుPathaan: ఆస్ట్రేలియాలో బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టిన షారుఖ్ ఖాన్ పఠాన్

Pathaan: ఆస్ట్రేలియాలో బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టిన షారుఖ్ ఖాన్ పఠాన్

- Advertisement -

షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రం రోజురోజుకూ ఒకదాని తర్వాత మరో మైలురాయిని అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూనే ఉంది. దీపికా పదుకొనె, జాన్ అబ్రహం ముఖ్య పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే విడుదలైన అన్ని ఏరియాలలో రికార్డ్ కలెక్షన్లను నమోదు చేయడంతో పాటు బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే, ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లను సాధించింది.

ఇప్పుడు ఈ చిత్రం తన విజయగాథకు మరో మైలురాయిని జొడించింది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ ఇప్పుడు బాహుబలి 2 ను అధిగమించి ఆస్ట్రేలియాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. షారూఖ్ ఖాన్ ఓవర్సీస్ లో ఎంత పెద్ద స్టార్ అనేది ఈ విషయంతో మరోసారి రుజువైంది.

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా ఆస్ట్రేలియాలో 4.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసి ఇప్పటి వరకూ భారతీయ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. పఠాన్ ఈ మార్కును అధిగమించి ప్రస్తుతం 4,512,563 డాలర్ల వద్ద ఉంది.

READ  Pathaan: ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు సిద్ధం అవుతున్న పఠాన్

ఆస్ట్రేలియాలో టాప్ 5 గ్రాసర్ల లిస్ట్ ఇదే..

  • పఠాన్: 4.512 మిలియన్ డాలర్లు
  • బాహుబలి 2: 4.50 మిలియన్ డాలర్లు
  • ఆర్ఆర్ఆర్ : 3.6 మిలియన్ డాలర్లు
  • కేజీఎఫ్ చాప్టర్ 2: 3.45 మిలియన్ డాలర్లు
  • పద్మావత్: 3.16 మిలియన్ డాలర్లు

వచ్చే వారాంతంలో మహాశివరాత్రి కావడంతో ఈ సిద్ధార్థ్ ఆనంద్ ప్రాజెక్టుకు పండగ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఆ లాభంతోనే పఠాన్ సినిమా త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ మార్క్ అందుకునే దిశగా దూసుకెళ్తుంది. ఈ బ్లాక్ బస్టర్ తో షారుఖ్ ఖాన్ అద్భుతమైన పునరాగమనం చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి బాలీవుడ్ డల్ స్టేజ్ కు ముగింపు పలికారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Pathaan: పఠాన్ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్- ఆల్ టైమ్ రికార్డ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories