Homeసినిమా వార్తలుషారుఖ్ ఖాన్ జవాన్ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు

షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు

- Advertisement -

తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం “జవాన్” సినిమా. ఈ సినిమా కోసం షారుఖ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. లోగడ ఈ చిత్రం నుంచి విడుదలయిన చిన్న విడియో గ్లింప్స్ అద్భుతంగా ఉండి సినిమా మీద అందరిలో ఆసక్తిని పెంచేసింది. 2018లో వచ్చిన ‘జీరో’ సినిమా విడుదలైన తర్వాత కింగ్ ఖాన్ మరో సినిమా చేయలేదు. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆయన హీరోగా కనిపించనున్న ఈ సినిమా పట్ల ట్రేడ్ వర్గాలు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. తద్వారా ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే షారుఖ్ రికార్డుల వేటను ప్రారంబించారు.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నారు. కాగా నయనతార కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇక జవాన్ చిత్రం తాలూకు ఆల్ ఇండియా శాటిలైట్ హక్కులను జీ టీవీ సొంతం చేసుకుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ కు సంభందించిన డిజిటల్ హక్కులను దిగ్గజ ఓటీటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ రెండు ఒప్పందాల మొత్తం విలువ ఏకంగా 250 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది.

జవాన్ సినిమాలో మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్ లో షారుఖ్ ను చూపించే టీజర్‌ను అట్లీ ఇదివరకే విడుదల చేయడంతో సినిమా పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సాధారణంగా రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా చేసే షారుఖ్ ను సరికొత్త అవతార్ లో చూపించడంతో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. షారుక్ ఖాన్ 2023 సంవత్సరంలో వరుసగా భారీ సినిమాలతో ప్రేక్షకులని పలకరించెందుకు సిద్ధంగా ఉన్నారు. జవాన్‌ సినిమాతో పాటు, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ మరియు రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించే ‘డుంకీ’లో కూడా ఆయన కనిపిస్తారు.

READ  మలయాళంలోనూ విడుదల కానున్న గాడ్ ఫాదర్.. అందరినీ ఆశ్చర్యపరిచిన మెగాస్టార్

జూన్ 2023లో విడుదల కానున్న జవాన్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories