Homeసినిమా వార్తలుShaakuntalam: ప్రీమియర్స్ ప్లాన్స్ క్యాన్సిల్ చేసిన శాకుంతలం టీం

Shaakuntalam: ప్రీమియర్స్ ప్లాన్స్ క్యాన్సిల్ చేసిన శాకుంతలం టీం

- Advertisement -

సమంత నటించిన భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే. హీరోయిన్ సమంత, దర్శకుడు గుణశేఖర్, చిత్ర యూనిట్ తమ సినిమాకి వీలైనంత మంచి క్రేజ్ తెచ్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నించారు కానీ వారి ప్రమోషనల్ కంటెంట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల సినిమాకి అనుకున్న క్రేజ్ రాలేదు. అందుకే సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్ ఏర్పాటు చేస్తే హైప్ క్రియేట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించింది.

కాబట్టి ఈ సినిమాకు క్రేజ్ వచ్చేలా శాకుంతలం టీం సోమ, బుధ, గురువారాల్లో ఇండస్ట్రీ, మీడియా సర్కిల్స్ కోసం స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేసింది. అయితే సోమవారం ప్రీమియర్స్ కు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా షాకింగ్ గా ఉండింది.

అందుకే ఇప్పుడు ఎలాంటి రిస్క్ తీసుకోదలచుకోని చిత్ర బృందం ఈ రోజు, రేపు అనుకున్న అన్ని ప్రీమియర్ ప్లాన్స్ ను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రకంగా శాకుంతలం సినిమా ఇప్పుడు నేరుగా శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది.

READ  Kota Srinivasa Rao: తాను ఇంకా బతికే ఉన్నాను, చనిపోలేదని భావోద్వేగమైన వీడియో షేర్ చేసిన లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు

అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన కాళిదాసు సంస్కృత నాటకం ‘అభిజ్ఞా శాకుంతలం’ ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందిన శాకుంతలం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. 3డిలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ తో కలిసి నీలిమ గుణ నిర్మించారు.

సమంత నటించిన శాకుంతలం చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో దుష్యంత్ పాత్రలో దేవ్ మోహన్ నటించగా ప్రిన్స్ భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించారు. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధూ, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ బాణీలు సమకూర్చారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Naga Shourya: పబ్లిక్‌గా ప్రియురాలిని దుర్భాషలాడిన ఒక యువకుడి పై ఫైర్ అయిన నాగ శౌర్య


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories