Homeసమీక్షలుShaakuntalam: శాకుంతలం సినిమా రివ్యూ: నీరసమైన మరియు దుర్భరమైన డ్రామా

Shaakuntalam: శాకుంతలం సినిమా రివ్యూ: నీరసమైన మరియు దుర్భరమైన డ్రామా

- Advertisement -

చిత్రం: శాకుంతలం
రేటింగ్: 2/5
నటీనటులు: సమంత, దేవ్ మోహన్, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల
దర్శకుడు: గుణశేఖర్
నిర్మాత: నీలిమ గుణ
విడుదల తేదీ: 14 ఏప్రిల్ 2023

సమంత నటించిన శాకుంతలం కొన్ని నెలల ఆలస్యం తర్వాత ఎట్టకేలకు తెర పైకి వచ్చింది. 8 సంవత్సరాల తర్వాత దర్శకుడు గుణశేఖర్ పునరాగమనం మరియు సమంత యొక్క ప్రత్యేకమైన పాత్ర ఎంపిక ఈ సినిమా పట్ల ఆసక్తిని సృష్టించింది. కానీ, సినిమా ప్రమోషనల్ కంటెంట్ మరియు ట్రైలర్‌లు ప్రేక్షకులలో గొప్ప బజ్‌ని సృష్టించలేకపోయాయి. మ‌రి ఈ సినిమాలో కంటెంట్ ప‌టిష్టంగా ఉందో  లేదో చూద్దాం.

కథ: శకుంతల (సమంత) అనే అసమానమైన అందం కలిగిన స్త్రీ రిషి కణ్వా ఆశ్రమంలో నివసిస్తుంది. కాగా వేట యాత్రలో భాగంగా అక్కడికి వచ్చిన దుష్యంత రాజు (దేవ్ మోహన్) ఆమెను చూస్తాడు మరియు ప్రేమలో పడతాడు. శకుంతల కూడా అవే భావాలను ప్రతిస్పందించి ఆ జంట వివాహం చేసుకుంటుంది. దుష్యంత తన రాజ విధులకు హాజరయ్యేందుకు బయలుదేరతాడు. అలానే ఆమెకు తన గుర్తుగా ఒక ఉంగరం ఇచ్చి తిరిగి వస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే దుర్వాస (మోహన్ బాబు) ముని మూలాన శకుంతల తనకు అత్యంత ఇష్టమైన వారు తనను మరచిపోతారు అనే శాపాన్ని ఎదుర్కుంటుంది. ఆ శాపం కారణంగా దుష్యంతుడు శాకుంతలను మరిచిపోయినప్పుడు ఏమి జరుగుతుంది మరియు శకుంతల సమస్యలతో ఎలా పోరాడుతుంది అనేది మిగతా సినిమా.

READ  Shaakuntalam: 'శాకుంతలం' అవుట్ పుట్ పట్ల సూపర్ హ్యాపీగా ఉన్న నటి సమంత

నటీనటులు: అనేక లొసుగులు మరియు నిర్మాణ నాణ్యత తక్కువగా ఉన్న ఈ చిత్రాన్ని భుజాల మోసే కఠినమైన పనిని టైటిల్ రోల్‌లో సమంత పొందారు. ఆమె మంచి నటనే కనబర్చినా కానీ సినిమా యొక్క మొత్తం పేలవమైన అనుభవం ఆమె పనితీరును కప్పివేస్తుంది. దేవ్ మోహన్ రాజు దుష్యంతగా బాగానే కనిపిస్తారు కానీ యాక్షన్ సీక్వెన్స్ విషయానికి వస్తే, లోటుపాట్లు బాగా కనిపిస్తాయి. మోహన్ బాబు దుర్వాస మునిగా అద్భుతంగా నటించారు మరియు ఆయన డిక్షన్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి ఏకైక అద్భుతమైన నటనను అందించాయి. ప్రకాష్ రాజ్, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల, అదితి బాలన్ అందరికీ పరిమిత స్క్రీన్ సమయం ఉంది కానీ వారిలో ఎవ్వరికీ నటనకు ప్రత్యేక పరిధి అంటూ ఏమీ లేదు. చిన్న పాత్రలో తళుక్కున మెరిసిన అల్లు అర్హ ఈ సినిమా యొక్క సర్ప్రైజ్ ప్యాకేజీగా నిలిచి యువరాజు భరతునిగా ఆకట్టుకుంటారు.

విశ్లేషణ: మేకింగ్ క్వాలిటీ తక్కువగా ఉండటం వల్ల ఈ సినిమా బాగా దెబ్బతింది. నాసిరకం VFX, పేలవంగా ఎగ్జిక్యూట్ చేయబడిన యుద్ధ సన్నివేశాలు మరియు బలవంతపు భావోద్వేగాలు, పేలవమైన కథనం, ఆకర్షణీయంగా లేని స్క్రీన్‌ప్లే మరియు ఇతరత్రా బలవంతపు భావోద్వేగాలు, ఇవన్నీ కలిపి శాకుంతలం చలనచిత్రంగా బాగున్నాయి అని చెప్పడానికి ఏమీ లేకుండా చేశాయి. ఈ చిత్రంలో చాలా ప్రతిభావంతులైన తారాగణంతో నిండి పోయింది కానీ దాని ప్రాథమిక కథాంశం మరియు ఫ్లాట్ నేరేషన్‌ వల్ల, ఈ సినిమా వీక్షకులకు చాలా కొద్ది క్షణాల ఆనందాన్ని మాత్రమే అందిస్తుంది.

READ  Das Ka Dhamki: దాస్ కా ధమ్కీ సినిమా రివ్యూ - ఫార్ములా ఎంటర్టైనర్

ప్లస్ పాయింట్లు:

  • సమంత లుక్
  • అల్లు అర్హ ఉన్న సన్నివేశాలు

మైనస్ పాయింట్లు:

  • స్లో నేరేషన్
  • డల్ స్క్రీన్ ప్లే
  • నాసిరకం గ్రాఫిక్స్
  • దారుణంగా తీయబడిన యుద్ధ సన్నివేశాలు 

తీర్పు:

‘అభిజ్ఞాన శాకుంతలం’ ను వెండి తెర పైకి తీసుకురావాలనే గుణశేఖర్ ఆలోచన చాలా మంచిదే. ఆయన అద్భుతమైన మరియు ప్రతిభావంతులైన స్టార్‌కాస్ట్‌ ను తన సినిమాలో భాగం చేశారు. అయినప్పటికీ, చలనచిత్రం యొక్క నాణ్యత తక్కువగా ఉండటంతో పాటు మొత్తంగా డ్రామాను ఆకర్షణీయంగా చిత్రీకరించలేకపోవడం వలన ఆయన ప్రయత్నం విఫలం అయింది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories