Homeసినిమా వార్తలుShaakuntalam: శాకుంతలం 3డి వెర్షన్ పై భారీ ఆశలు పెట్టుకున్న మేకర్స్

Shaakuntalam: శాకుంతలం 3డి వెర్షన్ పై భారీ ఆశలు పెట్టుకున్న మేకర్స్

- Advertisement -

సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాయ శాకుంతలం అనే నాటకం నుంచి శాకుంతలం ప్రేరణ పొందింది. ఈ చిత్రం భారతీయ సినిమా యొక్క ఇతిహాస ప్రేమకథలలో ఒక అద్భుత గాథను ప్రతిబింబిస్తుంది.

ప్రస్తుతం శాకుంతలం చిత్ర బృందం పెద్ద ఎత్తున తమ సినిమాని ప్రమోట్ చేస్తోంది. సమంత, గుణశేఖర్, నిర్మాతలు నీలిమ గుణ, దిల్ రాజు, ప్రముఖ నటుడు దేవ్ మోహన్ లతో కూడిన చిత్ర యూనిట్ ఇటీవల కొచ్చి, ముంబైలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసింది. ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఎంత ప్రయత్నించినా సినిమాకి వారు అనుకున్న స్థాయిలో క్రేజ్ రాలేదు.

అందుకే ఇక నిర్మాతలు తమ సినిమాకి 3డి వెర్షన్ పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. 3డిలో తీయాలనే నిర్ణయం కారణంగా ఈ సినిమా బడ్జెట్ పెరిగిందని, పలుమార్లు వాయిదా పడిందని సమాచారం. ఇప్పుడు ‘శాకుంతలం’ టీం ఈ రోజు, బుధవారాల్లో ఇండస్ట్రీ వర్గాల కోసం త్రీడీ వెర్షన్ తాలూకు స్పెషల్ ప్రీమియర్ ప్లాన్ చేసింది.

READ  Shaakuntalam: సమంత 'శాకుంతలం' పై వచ్చిన పుకార్లను ఖండించిన గుణశేఖర్

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు, విజువల్ ఓరియెంటెడ్ సినిమాలను 3డిలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండడంతో 3డి వెర్షన్ సినిమాలకు పెద్ద ఎత్తున హెల్ప్ అవుతోంది. శాకుంతలం బడ్జెట్ రికవరీ కావాలంటే అన్ని భాషల్లో మ్యాజిక్ చేయాలి. ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలవుతోంది. మరి నిర్మాతల వ్యూహం ఫలిస్తుందా లేదా వేచి చూడాలి.

సమంత నటించిన శాకుంతలం చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ తో కలిసి నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాలో దుష్యంత్ పాత్రలో దేవ్ మోహన్ నటిస్తుండగా, ప్రిన్స్ భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటిస్తోంది. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధూ, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ బాణీలు సమకూర్చారు.

READ  Shaakuntalam: సమంత నటించిన శాకుంతలం సినిమాకు భారీ ఆర్థిక ఇబ్బందులు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories