సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన పౌరాణిక చిత్రం శాకుంతలం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మరి తొలి షోలు, యూఎస్ ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకు వచ్చిన టాక్, రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.
తొలి షోల నుంచి శాకుంతలం సినిమాకి వచ్చిన టాక్ అస్సలు బాగోలేదు. పేలవమైన వీఎఫ్ఎక్స్ తో తెరకెక్కిన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ తరహా వీఎఫ్ఎక్స్ తో త్రీడీ టెక్నాలజీ రిలీజ్ ను చిత్ర బృందం ఎందుకు ఎంచుకున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. కాగా సినిమా కథనం కూడా చాలా స్లోగా సాగడంతో ప్రేక్షకులు ఎంగేజ్ కాలేక, కనెక్ట్ కాలేకపోతున్నారని అంటున్నారు.
అలాగే యుద్ధ సన్నివేశాలు సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ అని, ఎమోషన్స్ పార్ట్ కూడా వర్కవుట్ కాలేదని అంటున్నారు. ఓవరాల్ గా శాకుంతలం సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో ఆడియన్స్ టాక్ ఏంటంటే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు తప్ప కొత్తగా కానీ, థ్రిల్లింగ్ గా అనిపించేటట్లు ఏమీ లేదు అని అంటున్నారు. కేవలం సమంత మరియు అల్లు అర్హ నటన సినిమాకు మాత్రమే ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు అట. ఓవరాల్ గా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చాలా నిరాశాజనకమైన స్పందన వచ్చింది.
అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన కాళిదాసు సంస్కృత నాటకం ‘అభిజ్ఞా శాకుంతలం’ ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందిన శాకుంతలం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల అయింది. 3డిలో రూపొందించబడిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ తో కలిసి నీలిమ గుణ నిర్మించారు.
సమంత నటించిన శాకుంతలం చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో దుష్యంత్ పాత్రలో దేవ్ మోహన్ నటించగా.. ప్రిన్స్ భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించారు. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధూ, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ బాణీలు సమకూర్చారు.