వెబ్ సిరీస్: సేవ్ ది టైగర్స్
రేటింగ్: 3.25/5
నటీనటులు: ప్రియదర్శి, అభినవ్ గోమతం, కృష్ణ చైతన్య, పావని గంగిరెడ్డి, హైమవతి, దేవియాని, రోహిణి, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షవర్ధన్
దర్శకుడు: తేజ కాకుమాను
స్ట్రీమింగ్ వేదిక: హాట్‌స్టార్
విడుదల తేదీ: 27 ఏప్రిల్, 2023
కథ: డెయిరీ ఫామ్ యజమాని ఘంటా రవి (ప్రియదర్శి), ఔత్సాహిక రచయిత రాహుల్ (అభినవ్ గోమతం), క్రియేటివ్ యాడ్ రైటర్ విక్రమ్ (కృష్ణ చైతన్య) డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టవుతారు. వారు కేసును ఉపసంహరించుకోవాలని పోలీసు అధికారిని అభ్యర్థిస్తారు మరియు ఈ ప్రక్రియలో వారు తమ కథలను చెబుతూ వారు ముగ్గురు ఎలా స్నేహితులు అయ్యారో.. వారి భార్యల వల్ల తమ జీవితం ఎలా ప్రభావితం అయిందో పంచుకుంటారు. మరి వారు అతనిని ఒప్పించగలరా లేదా అనేది మిగిలిన కథ.
నటీనటులు: ప్రియదర్శి – సుజాత, పావని గంగిరెడ్డి – అభినవ్ గోమతం మరియు కృష్ణ చైతన్య – దేవియాని అందరూ ప్రధాన పాత్రల్లో చక్కగా నటించి మెప్పించారు. ముఖ్యంగా అభినవ్ గోమతం మరియు ప్రియదర్శి వినోదానికి విస్తారమైన స్కోప్ ఉన్న పాత్రలను పొందారు మరియు ఆ పాత్రలు బాగా ఆకట్టుకున్నాయి. జబర్దస్త్ ఫేమ్ రోహిణి పనిమనిషిగా మంచి పాత్రను పొందారు మరియు ఆమె బాగా నవ్వించారు. హర్షవర్ధన్, గంగవ్వ, వేణు యెల్దండి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు సముచితంగా నటించారు.
విశ్లేషణ: సేవ్ ది టైగర్స్‌ను దర్శకుడు తేజ కాకుమాను రూపొందించారు మరియు ఈ సీరీస్ ను ఆకట్టుకునేలా చెప్పడంలో ఆయన చాలా వరకూ విజయవంతమయ్యారు. ప్రారంభం నుండి చివరి వరకు, షో చాలా ఉల్లాసకరమైన క్షణాలను కలిగి ఉంది. కామెడీ మరియు భావోద్వేగాలు చక్కగా మిళితం చేయబడ్డాయి, అక్కడక్కడా కొన్ని భాగాలు మినహా టెంపో ఎక్కడా తగ్గలేదు. ప్లాట్ పాయింట్ బాగా తెలిసినట్లు అనిపిస్తుంది, కానీ కథనంలో మంచి పట్టు ఉంది.
ప్లస్ పాయింట్లు:
- నటీనటులు
- కథనం
- హాస్య సన్నివేశాలు
- చక్కని భావోద్వేగాలు
మైనస్ పాయింట్లు:
- పునరావృతమయ్యే సన్నివేశాలు
- చివరి ఎపిసోడ్
తీర్పు:
సేవ్ ది టైగర్స్ ఆద్యంతం ఆనందించదగిన ఒక వినోదభరితమైన వెబ్ సిరీస్. ప్రియదర్శి, అభినవ్ గోమతం, మరియు కృష్ణ చైతన్యల నటన మరియు వారి మధ్య హాస్య సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. కొన్ని పునరావృతమయ్యే సన్నివేశాలు మరియు కాస్త అర్ధాంతరంగా ముగిసిన చివరి ఎపిసోడ్ తప్ప.. ఈ వారాంతంలో మీ కుటుంబంతో కలిసి చూడటానికి ఈ కార్యక్రమం చక్కని ఎంపిక అనడంలో ఎలాంటి సందేహం లేదు.