కోలీవుడ్ స్టార్ నటుడు కార్తీ, మరియు సీనియర్ నటుడు అరవింద్ స్వామి ల కలయికలో ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఎమోషనల్ జర్నీ మూవీ సత్యం సుందరం. ఈ మూవీలో కార్తీ కి జోడీగా యువ నటి దివ్యశ్రీ కనిపించగా గోవింద్ వసంత సంగీతం అందించారు. 2డి ఎంటర్టైన్మెంట్ సంస్థ పై సూర్య, జ్యోతిక ఈ మూవీని నిర్మించారు.
హృద్యమైన ఎమోషనల్ రైడ్ గా రూపొందిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పర్వాలేదనిపంచే స్థాయిలో సక్సెస్ అయింది. కార్తీ తో పాటు అరవింద్ స్వామిల పై ప్రధానంగా సాగే ఈ కథ అందరి మదిని తాకుతుంది. గతంలో 96 వంటి లవ్ స్టోరీ తీసి అందరినీ ఆకట్టుకున్న ప్రేమ్ కుమార్ మరొక్కసారి సత్యం సుందరంలో బాగా పేరు సొంతం చేసుకున్నారు.
ఇక ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ తాజాగా లాక్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్ లో సత్యం సుందరం మూవీ అక్టోబర్ 25 నుండి పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది. మరి థియేటర్స్ ఆడియన్స్ ని అలరించిన ఈ మూవీ ఎంతమేర ఓటిటి లో మెప్పిస్తుందో చూడాలి.