Homeసినిమా వార్తలుహిందీలో రీమేక్ కి సిద్దమైన 'సత్యం సుందరం' ?

హిందీలో రీమేక్ కి సిద్దమైన ‘సత్యం సుందరం’ ?

- Advertisement -

96 వంటి హృద్యమైన ప్రేమకథా చిత్రం తెరకెక్కించి పెద్ద విజయం అందుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్ ఇటీవల ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా సత్యం సుందరం ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. కోలీవుడ్ నటులు కార్తీ, అరవిందస్వామి కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా ప్రతి ఒక్క ఆడియన్ మదిని తాకింది.

2డి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై సూర్య, జ్యోతిక ఈ మూవీని నిర్మించారు. ముఖ్యంగా అందులోని ఎమోషన్స్ ఆకట్టుకునే సన్నివేశాలు డైలాగ్స్ వంటివి అటు తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే సత్యం సుందరం సినిమాకి మంచి పేరు అయితే లభించింది కానీ, బాక్సాఫీస్ పరంగా ఇది పెద్దగా పెద్ద అందుకోలేకపోయింది.

అయితే ఆ మూవీ బాగా పేరు తీసుకురావడంతో సూర్య, కార్తీ కలిసి ఇటీవల దర్శకుడు ప్రేమ్ కుమార్ కి ఒక ఖరీదైన కారు బహుమతిగా అందించారు. అయితే అసలు విషయం ఏమిటంటే లేటెస్ట్ బాలీవుడ్ అప్డేట్ ప్రకారం త్వరలో ఈ సినిమా హిందీలో రీమేక్ కానున్నట్టు తెలుస్తోంది.

READ  త్రివిక్రమ్ శ్రీనివాస్ ని వదిలేదు లేదు : పూనమ్ కౌర్

ఈ సినిమాలో అరవింద స్వామి పాత్రని షాహిద్ కపూర్ అలానే కార్తి పాత్రని ఇషాన్ కట్టర్ పోషించనునట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా అతి త్వరలో సత్యం సుందరం రీమేక్ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ తో కూడిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories