నాచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ సరిపోదా శనివారం. అందాల నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ లెవెల్లో భారీగా నిర్మిస్తుండగా కీలక పాత్రల్లో తమిళ నటుడు దర్శకుడైన ఎస్ జె సూర్య, టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సాయి కుమార్ నటిస్తున్నారు.
ఇప్పటికే సరిపోదా శనివారం మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అన్ని కూడా నాని ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, నేడు ఫ్యాన్స్ సమక్షంలో సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అనంతరం యూట్యూబ్ లో ట్రైలర్ విడుదల చేసారు. ముఖ్యంగా ట్రైలర్ లో నాని నాచురల్ స్టైల్, పెర్ఫార్మన్స్ తో పాటు యాక్షన్ ఎమోషనల్ అంశాలు బాగున్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. మొత్తంగా అందరి నుండి మంచి రెస్పాన్స్ అందుకున్న సరిపోదా శనివారం ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో బాగానే వ్యూస్ రాబడుతోంది. కాగా ఈ మూవీ ని ఆగష్టు 29న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.