విక్టరీ వెంకటేష్ హీరోగా యువ అందాల నటీమణులు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తీస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ ఫ్యామిలి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పై అందరిలో మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి.
ఇందులో వెంకటేష్ పాత్రతో పాటు ఇద్దరు హీరోయిన్స్ పాత్రలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయని, వారి మధ్య జరిగే కథతో ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ లభించడం ఖాయం అని అంటోంది సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీమ్. ఇక ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ఒక ప్రెస్ మీట్ ద్వారా అనౌన్స్ చేసారు మేకర్స్.
హీరో, హీరోయిన్స్ తో పాటు పలువురు మూవీ టీమ్ పాల్గొన్న ఈ మీట్ లో భాగంగా తమ మూవీని రానున్న సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీకి భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల ఒక స్పెషల్ సాంగ్ ని పడనున్నారు. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ అనంతరం ఎంత మేర సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.