టాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ హీరోగా యువ అందాల కథానాయికలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ క్రేజీ కాంబో మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై దిల్ రాజు నిర్మిస్తుండగా భీమ్స్ సిసిలోరియో సంగీతం అందించారు.
ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నిటితో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ మూవీ యొక్క ఏపీ టికెట్ రేట్స్ హైక్ ని పరిశీలిస్తే, ఓపెనింగ్ డే రోజు ఈ మూవీకి 6 షోస్ ప్రదర్శించనున్నారు. ఇక మల్టి ప్లెక్స్ లో రూ. 125 కోట్లు, సింగిల్ థియేటర్స్ లో రూ. 100 హైక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అలానే జనవరి 15 నుండి 23 వారు డైలీ 5 షోస్ కి కూడా అనుమతి లభించింది.
ఇక తాజాగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్ రెండు రోజుల్లో 15 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పరిచింది. ఒకవేళ మూవీకి బాగా టాక్ లభిస్తే ఈజీగా ఇది ఫ్యామిలీస్ ని ఆకర్షించి బాగా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేస్తుందని తెలుస్తోంది.