టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు ఇటీవల అక్కినేని ఫ్యామిలీ యొక్క మూడవ వారసుడు నాగచైతన్యని గ్రాండ్ గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్నేళ్ల కాపురం అనంతరం ఇటీవల చైతన్య తో అధికారికంగా విడిపోయారు సమంత. అనంతరం తన ఫ్యామిలీతో కలిసి విడిగా జీవిస్తున్న సమంత, కొన్నాళ్లుగా తన లైఫ్ తో పాటు సినీ కెరీర్ పై మరింతగా దృష్టి పెట్టి కొనసాగుతున్నారు.
తనకు ఇటీవల మాయోసైటిస్ వ్యాధి సోకినప్పుడు అలానే చైతన్యతో విడాకుల సమయంలో ఎంతో మనోవేదనకు గురయ్యానని, ఆ సమయంలో ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్, శ్రేయోభిలాషుల తోడ్పాటు ఎప్పటికీ మరువలేనిదని తెలిపారు సమంత.
ఇక తాజాగా తన డైవర్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో భాగంగా సమంత మాట్లాడుతూ, తనని సెకండ్ హాండ్ అని వేస్ట్ అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యల పై ప్రజల పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా తన ఎక్స్ కి గిఫ్ట్స్ ఇవ్వడం కోసం ఎంతో డబ్బు ఖర్చు చేసానని కూడా మరొక ఇంటర్వ్యూ లో సమంత తెలిపారు. మొత్తంగా సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.