Homeసినిమా వార్తలుఇన్స్టాగ్రామ్ లో కోట్లు సంపాదిస్తున్న సమంతా

ఇన్స్టాగ్రామ్ లో కోట్లు సంపాదిస్తున్న సమంతా

- Advertisement -

ఈ తరం హీరోయిన్స్ లో మోస్ట్ బిజీ అయిన హీరోయిన్ సమంతా. ఏ మాయ చేశావే తో నిజంగానే ప్రేక్షకులను మాయ చేసింది. ఆ తరువాత బృందావనం,దూకుడు వంటి సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోయింది. మంచి నటి అవడంతో పాటు క్యూట్ లుక్స్, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండటం వంటి కారణాల వల్ల తన కెరీర్ లో ఎప్పుడు కూడా పెద్దగా అవకాశాలకు బ్రేక్ పడలేదు.

మధ్యలో ఒకసారి ఆరోగ్యం బాగోలేక, నాగ చైతన్య తో పెళ్ళి జరిగిన కొన్ని రోజుల వరకు మాత్రమే కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు కాస్త తగ్గినా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కెరీర్ ను సాఫీగానే ముందుకు తీసుకెళుతుంది.

అయితే నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత మరో కొత్త మార్గంలో తన కెరీర్ ను చక్కబెట్టుకుంది సమంతా. ఇన్స్టాగ్రామ్ అనేది ఎంతోమందికి కెరీర్ ను ఇచ్చిన ప్లాట్ ఫామ్, చాలా తేలికగా తీసిపడేసే రీల్స్, టిక్ టాక్ తరహా పేరడీ డాన్స్ లతోనే పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సమంతా తనకున్న క్రేజ్ ను, ఇన్స్టా లో ఉన్న ఫాలోయర్స్ ద్వారా ఉపయోగించుకుంటుంది. ఇటీవలి కాలంలో సమంతా ఫోటోషూట్ ల సంఖ్య బాగా పెరిగింది. ట్రెండీ ఔట్ ఫిట్ లకు తోడు హాట్ ఫోజ్ లతో కుర్రాళ్ళ మతి పోగొడుతుంది.

READ  విరాట పర్వం ప్రీమియర్ షో లకు అద్భుత స్పందన

ఇన్స్టా లో బ్రాండింగ్ కూడా ఒక భాగమే, సినిమా హీరోలు, హీరోయిన్ లే కాక, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్ లు కూడా ఈ రకమైన బ్రాండింగ్ ద్వారా లబ్ది పొందిన వారే. ఇప్పుడు సమంతా కూడా అదే దారిలో వెళ్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఫోటో షూట్ లు మాత్రమే కాకుండా ప్రమోషనల్ పోస్ట్ ల ద్వారా దాదాపు నెలకు 3 కోట్ల వరకూ సంపాదిస్తుంది అని సమాచారం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను సాధారణంగా హీరోయిన్ లు బాగానే వంటబట్టించుకుని ఉంటారు. సమంతా కూడా అదే పని చేస్తూ ఇటు తన సంపాదనతో పాటు వీక్షకులకు ఆనందాన్ని పంచిపెడుతుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  మళ్ళీ సినిమాలకు గుడ్ బై చెప్పనున్న పవన్?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories