పసందైన బాణీలతో, క్యాచీ లిరిక్స్ తో తనదైన శైలిలో సంగీతం అందించడంలో దేవీశ్రీ ప్రసాద్ కు ఎవరూ సాటి రారు.ఆయన పాటలకు ప్రేక్షకులు ఈలలు వేసి డాన్స్ చేయడం సర్వ సాధారణమైన విషయంగా చెప్పుకోవచ్చు. దేశం మొత్తం వైరల్ అయిన పుష్ప కావచ్చు,లేదా ఈ మధ్య ది వారియర్ చిత్రంలోని రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన బుల్లెట్ సాంగ్ కావచ్చు. ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా సంగీతం ఇవడం వల్లే దేవీ కెరీర్ ఇన్ని రోజుల లాంగ్ రన్ వచ్చింది.
ఇప్పటివరకు దేవీ ఎందరో స్టార్ హీరోల సినిమాలకు హిట్ మ్యూజిక్ అందించాడు. అలాగే దేవీ అంటే తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద దర్శకులు,సినిమాలకు పక్కా ఛాయిస్ గా ఉండేవారు. కొరటాల శివ, త్రివిక్రమ్ తో పాటు పలువురు దర్శకులు దేవీ ట్యూన్స్ నే తమ సినిమాలకు కావాలనుకునే వారు.
అలాంటి దేవీ మ్యూజిక్ ఓ స్టార్ కు అస్సలు నచ్చలేదు. దీంతో ఆయనను ఆ సినిమా నుండితొలగించారని తెలుస్తోంది. దేవిశ్రీ అందించిన ట్యూన్స్ పట్ల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారట. కబీ ఈద్ కబీ దివాళి ప్రాజెక్ట్ నుండి దేవినీ తప్పించి కేజీఫ్ తో మంచి పేరు తెచ్చుకున్న రవి బస్రూర్ ను ఎంచుకున్నారని తెలుస్తోంది.అలాగే ఆయన అందించిన టైటిల్ సాంగ్ సల్మాన్ కు విపరీతంగా నచ్చిందట.ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్, టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.
నిజానికి గతంలో దేవిశ్రీ అల్లు అర్జున్ కోసం కంపోజ్ చేసిన రింగా రింగా, సిటీ మార్ సిటీ మార్ సాంగ్స్ ట్యూన్స్ ను తన సినిమాలు రెడీ, బాడీగార్డ్ లలో వాడుకోగా అవి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.ఫర్హాద్ సామ్జీ తెరకెక్కిస్తున్న కబీ ఈద్ కబీ దివాళి చిత్రంలో పూజా హెగ్డే, కృతి సనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే ఓ పాట లో రామ్ చరణ్, పూజ, సల్మాన్, వెంకీ కలిసి స్టెప్స్ వేయనున్నారట. ఇక సల్మాన్ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఆయన ఈ మధ్య సౌత్ స్టార్ట్స్ తో ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు.
మరోవైపు దేవీ శ్రీ ప్రసాద్ విషయానికి వస్తే 2015 లో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన S/O సత్యమూర్తి సినిమా తరువాత త్రివిక్రమ్ మళ్ళీ దేవితో పని చేయలేదు.అంతకు ముందు త్రివిక్రమ్ ప్రతి సినిమాకు దేవీ యే సంగీతం అందించేవారు. ఇక కొరటాల శివ కెరీర్ తొలి సినిమా నుండి దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. ఆచార్య విషయానికి వచ్చేసరికి మార్చేశారు. ఆ తరువాత ఎన్టీఆర్ తో చేస్తున్న చిత్రానికి అనిరుధ్ ని ఎంచుకున్నారు. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి పని చేసే ఒకే ఒక స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాత్రమే. సుకుమార్ కి మాత్రం దేవిశ్రీ ఆస్థాన సంగీత దర్శకుడు అని చెప్పాలి. కేవలం సుకుమార్ దర్శకత్వం వహించే సినిమాకు కాకుండా ఆయన అసిస్టెంట్ లు దర్శకులుగా చేసిన సినిమాలకు కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.