పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా కన్నడ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ సలార్ పార్ట్ 1. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సొంతం చేసుకుంది.
పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, బని సింహా, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈమూవీని హోంబలె ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. సలార్ లో పవర్ఫుల్ మాస్ యాక్షన్ అంశాలు,ఎలివేషన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి.
విషయం ఏమిటంటే, మార్చి 21న సలార్ మూవీ రీ రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీ ఇప్పటికే హైదరాబాద్ లో రూ. 50 లక్షలు అలానే ఓవరాల్ గా ఇండియా వైడ్ రూ. 1 కోటికి పైగా అడ్వాన్స్ ప్రీ బుకింగ్స్ జరుపుకుంది.
ఒకరకంగా ఇది మంచి రికార్డు అని చెప్పాలి. రిలీజ్ కి మరొక నాలుగు రోజలు మాత్రమే మిగిలి ఉన్న ఈ మూవీ ఓవరాల్ గా ఎంతమేర రాబడుతుందో చూడాలి. కాగా అదే రోజున నాని, విజయ్ దేవరకొండ ల సక్సెస్ఫుల్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం కూడా మార్చి 21నే రీ రిలీజ్ కానుంది. దాని యొక్క ప్రీ బుకింగ్స్ కూడా బాగున్నాయి.