సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా విడుదలకు మరో రెండు రోజులే ఉండడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తోనే మంచి ఆసక్తిని క్రియేట్ చేయగా ఇప్పుడు అందరి చూపు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ పైనే ఉంది. ఇటీవల విడుదలైన రావణాసురుడు, శాకుంతలం, రుద్రుడు వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో టాలీవుడ్ చాలా డల్ స్టేజ్ లో ఉంది. ఈ వారం విరూపాక్ష, తరువాతి వారం తర్వాత ఏజెంట్ అయినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలవో లేవో చూడాలి.
ఇదిలా ఉండగా ఇటీవలే విరూపాక్ష సినిమా యొక్క వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ పూర్తయింది. ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలకు కలుపుకుని విరూపాక్ష అద్భుతమైన థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఆంధ్రా ఏరియా దాదాపు 10 కోట్ల నిష్పత్తిలో విక్రయించబడ్డాయి. సీడెడ్ రైట్స్ రూ.3 కోట్లు, నైజాం రైట్స్ మొత్తంగా రూ.8 కోట్లకు అమ్ముడయ్యాయి. ఆ రకంగా విరూపాక్ష సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ రూ.21 కోట్లు వరకూ ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.25 కోట్ల రూపాయల వరకూ జరగడం విశేషం.
నిజానికి ఈ సినిమా జానర్ కి ఇది కాస్త ఎక్కువ.బిజినెస్ అయినా.. సినిమాకి టాక్ బాగా వస్తే మటుకు వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా లాంగ్ రన్ వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఇప్పటికే ఈ సినిమా పై ఇండస్ట్రీ వర్గాలలో అద్భుతమైన టాక్ వినిపిస్తుంది.
1990ల కాలం నేపథ్యంలో సుకుమార్ నేతృత్వంలో కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. విరూపాక్ష ఇన్ సైడ్ రిపోర్ట్ నిజమవ్వాలని కోరుకుందాం.