సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విరూపాక్ష సినిమా గత కొన్ని రోజులుగా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 21, 2023న విడుదల కానున్న ఈ సినిమాకి నూతన దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించగా, సంయుక్తా మీనన్ కథానాయికగా నటించారు.
కాగా విరూపాక్ష టీం ఇటీవల ఇండస్ట్రీ వర్గాల కోసం ఓ ప్రైవేట్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా, దానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. ఈ సినిమాలో అసాధారణమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ తో గ్రిప్పింగ్ కంటెంట్ ఉందని ప్రైవేట్ స్క్రీనింగ్ నుండి వచ్చిన నివేదికలు గట్టిగా చెప్తున్నాయి. ప్రేక్షకులకు ఖచ్చితంగా సినిమా నచ్చుతుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బి.వి.ఎన్.ఎస్.ప్రసాద్ నిర్మించిన విరూపాక్ష చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు పలు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనే విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బి.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి షామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్, హీరో హీరోయిన్లుగా నటించగా.. సునీల్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. రుద్రవనం అనే గ్రామంలో జరిగే అపరిష్కృత అంశాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి వెన్నుదన్నుగా నిలిచారు.