యువ దర్శకుడు సుజీత్ తో పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం అనౌన్స్ మెంట్ తోనే దాని పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది భారీ సినిమా అవుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా చుట్టూ చక్కర్లు కొడుతున్న ఓ రూమర్ వారికి షాక్ ఇచ్చింది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 40-50 నిమిషాల పాటు మాత్రమే ఉంటారని, ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ కేవలం 50 రోజులు మాత్రమే ఉంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది అభిమానులను ఆందోళనకు గురి చేసింది. కాగా ఈ సినిమా ఇటీవల వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ తరహాలో ఉంటుందని కూడా అంటున్నారు.
ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కు ఈ సినిమాలో పాటలు, ఫైట్లు ఉండవని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఈ పుకార్ల పై పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందిస్తూ ఇవి ఉట్టి గాలి వార్తలు అని ఖండించారు.
తాత్కాలికంగా ఓజీ అనే టైటిల్ పెట్టిన ఈ సినిమాకు సహజంగానే చాలా పైట్లకు స్కోప్ ఉంటుందని అంటున్నారు. సినిమాలో పాటలు లేకపోయినా వారికి ఒకే కానీ ఫైట్స్ లేవనే వార్తలను మాత్రం వారు వ్యతిరేకిస్తున్నారు.
ఈ ఊహాగానాలు ఉదయం నుండి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కు ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, సినిమాకి సంబందించిన ఇలాంటి పుకార్లు మరిన్ని వస్తాయని పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్దగా ఆందోళన చెందడం లేదు.