RRR అమెరికన్ చిత్ర పరిశ్రమ నుండి వరుసగా అవార్డులను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇటీవలే ప్రతిష్టాత్మక న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుండి RRR చిత్రానికి గానూ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల్లోనే RRR 2022 సంవత్సరానికి అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకుని మరో అరుదైన ఘనతను సాధించింది.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినిమాల నుండి గట్టి పోటీని ఎదుర్కొని 2022 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం యుఎస్ఎలో విమర్శకులు, సినీ ప్రేమికుల నుండి మంచి ఆదరణ పొందింది. యాక్షన్, భీకరమైన డ్యాన్స్ ఉన్న నాటు నాటు, మెలోడ్రామా, యాంటీ కలోనిజం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా ప్రేమికులను ముఖ్యంగా యాక్షన్ జానర్ అభిమానులను ఆకట్టుకుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులను గెలుచుకోవడం ద్వారా, వచ్చే ఏడాది మార్చి 12 న సమర్పించే 95 వ అకాడమీ అవార్డులలో RRR ఒకటికి మించి నామినేషన్లను పొందే అవకాశాలను బలోపేతం చేసుకుంది.
సాధారణంగా భారతీయ సినిమాలు USA బాక్సాఫీస్ వద్ద ఎన్ఆర్ఐలు లేదా భారత సంతతికి చెందిన వ్యక్తులను మించి ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళవు. అయితే, నెట్ ఫ్లిక్స్ కారణంగా, ఈ చిత్రం విస్తృత రీచ్ ను పొందింది, ఇది ఈ చిత్రాన్ని అంతర్జాతీయ విజయంగా మార్చింది, ముఖ్యంగా USAలో ఇది చాలా వారాలుగా టాప్ నాన్ ఇంగ్లీష్ మూవీ పొజిషన్ లో ఉంది.
ఈ చిత్రం జపాన్ లో కూడా గొప్ప బజ్ సృష్టిస్తోంది, అక్కడ ఇప్పటివరకు అతిపెద్ద విజయం సాధించిన భారతీయ చిత్రంగా అవతరించింది. భారతీయ సినిమాకు ఇది చాలా గొప్ప గుర్తింపు అనే చెప్పాలి. మరియు రాజమౌళి నిజంగా తెలుగు సినిమాను ప్రపంచ పటంలో నిలబెట్టారు.
ఆయన నిజంగా ఆస్కార్ అవార్డులలో ఉత్తమ దర్శకుడి నామినేషన్ పొందవచ్చు, ఇది గొప్ప దర్శకులు ఎందరికో కలగా ఉన్న అవార్డ్. మరి ఇక వాస్తవానికి దానిని రాజమౌళి ఇప్పుడే గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది.