Homeసినిమా వార్తలుRRR Re Release: USAలో 200కి పైగా థియేటర్లలో రీ రిలీజ్ అవుతున్న ఆర్...

RRR Re Release: USAలో 200కి పైగా థియేటర్లలో రీ రిలీజ్ అవుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా

- Advertisement -

ఆస్కార్ అవార్డ్స్ వేడుక‌కు ప‌ది రోజుల ముందు ఆర్ఆర్ఆర్ ఆమెరికాలోని థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్కార్ అవార్డుల బ‌రిలో నిలిచిన తొలి తెలుగు సినిమాగా ఆర్ఆర్ఆర్ చ‌రిత్ర‌ను సృష్టించిన సంగ‌తి తెలిసిందే. కాగా ఆస్కార్ వేడుక‌కు ముందు అమెరికా ప్రేక్ష‌కులను థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మ‌రోసారి అలరించనుంది. యూఎస్ఏలో మార్చి 3న ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వేరియ‌న్స్ ఫిల్మ్స్ ప్ర‌క‌టించింది.

కాగా 200 థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానున్న‌ట్లు వెల్ల‌డించ‌డ‌మే కాకుండా థియేట‌ర్ల వివ‌రాల్ని ప్రకటించింది. అవసరం అయితే డిమాండ్ బట్టి థియేట‌ర్ల‌ సంఖ్య పెంచుతామని కూడా తెలిపింది. అంతే కాకుండా ఈ చిత్రం మార్చి 1న ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రదర్శన’గా RRR Fan CelebRRRation Live ద్వారా పొందుతుందని మరో కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

ఆస్కార్ అవార్డ్స్‌కు ప‌ది రోజుల ముందు ఈ సినిమా థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్రేక్షకులను తమ ఊర మాస్ స్టెప్పులతో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ విశేష స్థాయిలో అలరించిన నాటు నాటు పాట‌కుగానూ బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

READ  NTR - Allu Arjun: 2024 వేసవిలో ఎన్టీఆర్ vs అల్లు అర్జున్ - విడుదల తేదీని లాక్ చేసిన పుష్ప2

మార్చి 13న ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ జ‌రగ‌నుంది. ఈ ఆస్కార్ అవార్డ్ వేడుక‌ల కోసం ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, రాజ‌మౌళితో పాటు ఆర్ఆర్ఆర్‌ చిత్ర యూనిట్ అమెరికాకు వెళ్లారు. నాటు నాటుకు పాట‌కు ఖచ్చితంగా ఆస్కార్ దక్కుతుందని ప్రతి తెలుగు సినీ ప్రేక్షకుడూ ఆశిస్తున్నాడు.

RRR అనేది ఇద్దరు విప్లవకారుల పాత్రల ఆధారంగా తెరకెక్కిన ఒక కల్పిత గాథ. 1920ల బ్రిటీష్ పాలనలో తమ స్వాతంత్ర్యం కోసం తిరిగి పోరాడాలని నిర్ణయించుకుంటారు. ఈ చిత్రం భారతీయ మరియు పాశ్చాత్య ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలను పొందింది మరియు అనేకసార్లు తిరిగి విడుదల చేయబడింది. ఈ చిత్రం అద్భుతమైన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌గా మారి జేమ్స్ కామెరూన్ వంటి దిగ్గజ దర్శకులచే కూడా కీర్తించబడింది.

అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ న‌ట‌న‌కు ప్రపంచ వ్యాప్తంగా సినీ దిగ్గ‌జాల‌తో పాటు అభిమానులు ప్ర‌శంస‌లు కురిపించారు. గ‌త ఏడాది మార్చి 25న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల‌కు పైగా వసూళ్లు రాబట్టింది.

Follow on Google News Follow on Whatsapp

READ  Pathaan: ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు సిద్ధం అవుతున్న పఠాన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories