Homeసినిమా వార్తలుఆర్ ఆర్ ఆర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షో ఫిక్స్

ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షో ఫిక్స్

- Advertisement -

తెలుగు సినీ దర్శక ధీర రాజమౌళి చెక్కినఅద్భుత శిల్పం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ఎలాంటి అంచనాలను మధ్య విడుదల అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెలుగు ఇండస్ట్రీ స.రాజమౌళి తెరకెక్కించగా ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటించడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ పై అతి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ మధ్య రిలీజ్ చేయగా, ఊహించినట్టుగానే అదిరిపోయే టాక్ ను తెచ్చుకుంది ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్దకు క్యూ కట్టారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో పాటు ఈ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది.

ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమాను ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా.. ఆర్ఆర్ఆర్‌ ను థియేట్రికల్ రన్ దాదాపు 10 వారాల తరువాత ఓటీటీలోకి కూడా విడుదల చేశారు. ఇక ముందుగా ఈ సినిమాను పే పర్ వ్యూ పద్ధతిలో అందుబాటులోకి తీసుకు రావాలని చూస్తే ఆ ప్రయత్నం పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయదంతో ఆ పని మానుకున్నారు.

READ  తమిళ దర్శకుడు హారి తో గోపిచంద్ కొత్త సినిమా

ఆ తర్వాత RRR చిత్రాన్ని ZEE 5 లో మే 20 నుండి స్ట్రీమింగ్ చేశారు. ఇక ఓటిటిలో కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఎన్నో రికార్డులను సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ ను చూసి హాలీవుడ్ ప్రేక్షకుల దగ్గర నుంచి సెలెబ్రిటీల దాకా సినిమాని చూసి ముక్త కంఠంతో సినిమాని అద్భుతం అంటూ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు.

హిందీ వెర్షన్ మినహా ఇతర దక్షిణ భాషల్లో జీ5 లో స్ట్రీమ్ అవుతున్న ఆర్ ఆర్ ఆర్.. ఇటీవలే దక్షిణ భాగాల్లో మళ్లీ డిస్నీ + హాట్ స్టార్ లో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా టీవిలో ప్రసారం అయ్యే ముహూర్తాన్ని కుదుర్చుకుంది.

హిందీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఆగస్ట్ 14, 2022 న రాత్రి 8 గంటలకు జీ సినిమా లో ప్రసారం కానుంది. నార్త్ లో ఈ చిత్రం మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో ఈ చిత్రం స్టార్ మాలో అదే రోజు అంటే ఆగస్ట్ 14,2022 సాయంత్రం 5:30కు ప్రసారం కానుంది.మరి ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి స్పందనను, రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  భారీ స్థాయిలో తెరకెక్కనున్న అడవి శేష్ సీక్వెల్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories