Homeసినిమా వార్తలుRRR: జపాన్ కలెక్షన్స్ సహాయంతో ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ 2 గ్రాస్ ను దాటేసేందుకు సిద్ధం...

RRR: జపాన్ కలెక్షన్స్ సహాయంతో ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ 2 గ్రాస్ ను దాటేసేందుకు సిద్ధం అవుతున్న ఆర్ ఆర్ ఆర్

- Advertisement -

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2.. ఈ రెండు సినిమాలు గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లుగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టాయి. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఆర్ఆర్ఆర్ కంటే కేజీఎఫ్ 2కు కాస్త ఆధిక్యం లభించింది.

ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గ్రాస్ 1150 కోట్లు కాగా, కేజీఎఫ్ 2 1200 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ రెండు సినిమాల మధ్య దాదాపు 50 కోట్ల వ్యత్యాసం ఉంది. ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో విడుదలైన రోజుల్లోని ప్రారంభ దశలో, ఈ చిత్రం జపనీస్ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు మరియు కొంతమంది ఆర్ ఆర్ ఆర్ ను జపాన్ లో విడుదల చేయడం సమయం వృధా అని కూడా వ్యాఖ్యానించారు.

అయితే జపాన్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో విడుదలైన భారతీయ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకొని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. తక్కువ వసూళ్లతో మొదలైన ఈ సినిమా ఆ తర్వాత స్ట్రాంగ్ గా కొనసాగింది. ఈ రాజమౌళి బ్లాక్ బస్టర్ ఇప్పుడు జపాన్ లో 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

READ  Baahubali 2: బాహుబలిని ఆస్కార్ కోసం అప్లై చేయలేదని తెలిపిన నిర్మాత

ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ కంటే కేజీఎఫ్ 2 50 కోట్లకు పైగా ఆధిక్యం సాధించింది మరియు పైన చెప్పినట్టు ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో విజయవంతంగా ప్రదర్శితమైంది, ఆస్కార్ కు నామినేట్ అయిన తరువాత ఈ చిత్రం చాలా బాగా ఆడుతోంది, ఆ తర్వాత నుంచి మరింతగా వసూళ్లు పెరిగాయి.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ జపాన్ గ్రాస్ 45 కోట్లు వద్ద ఉంది, ఫుల్ రన్ లో ఎంత లేదన్నా కనీసం మరో 15-20 కోట్లు చేస్తుంది, కాబట్టి ఆర్ ఆర్ ఆర్ చిత్రం కెజిఎఫ్ 2 కలెక్షన్లను సులభంగా దాటగలదు. ఆ పని చేస్తే దంగల్, బాహుబలి 2 తరువాత ఆల్ టైమ్ టాప్ 3 గ్రాసర్ గా మారుతుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Dil Raju: దిల్ రాజు వ్యాఖ్యలు వారిసు తునివు టీమ్ మధ్య విభేదాలను సృష్టించాయా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories