ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైనప్పుడు, చాలా మంది ప్రేక్షకులు మరియు విమర్శకులు ఇది రాజమౌళి కెరీర్లోనే బలహీనమైన సినిమా అని పేర్కొన్నారు. మరియు వారు ఈ సినిమా కేవలం రాజమౌళి బ్రాండ్ మరియు ప్రధాన పాత్రలలో ఉన్న తారలు, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటన కారణంగా మాత్రమే ఈ చిత్రం మనుగడ సాగించిందని చూపించడానికి ప్రయత్నించారు.
ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి ఫీడ్ బ్యాక్ చాలా నెగిటివ్ గా వచ్చిన సంగతి తెలిసిందే. అది రాజమౌళి స్టాండర్డ్స్ లో లేదని అందరూ చెప్పారు. అయితే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయినప్పటి నుంచీ అంతర్జాతీయ ప్రేక్షకులు ఆర్ సినిమాను ప్రశంసించడం మొదలు పెట్టడంతో అంతా మారిపోయింది. అక్కడి నుంచి ఈ సినిమా ఖ్యాతి మరో స్థాయికి వెళ్లింది. ఇప్పుడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
రాజమౌళి విజన్ ను, అభిరుచిని అభినందించాల్సిందే. ఆయన గట్ ఫీలింగ్, కష్టం వల్ల మాత్రమే ఆర్ ఆర్ ఆర్ నేడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. కంటెంట్ పరంగా రామ్, భీమ్ అనే రెండు ప్రధాన పాత్రల మధ్య ఎన్నో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని యాక్షన్ ఎపిక్ గా మలిచారు.
అలాగే రాజమౌళి ప్లానింగ్, తన సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ఆయన చేసిన ప్రయత్నాలకు ఎవరూ సాటి రారని చెప్పవచ్చు. భారత దేశం నుంచి ఆస్కార్ కు అఫీషియల్ ఎంట్రీగా ఆర్ ఆర్ ఆర్ ను భారత ఫెడరేషన్ ఎంపిక చేయకపోయినా నిరాశ చెందకుండా FYI క్యాంపెయిన్ ద్వారా ఆస్కార్ అవార్డు కోసం మళ్లీ ప్రయత్నించారు.
అంతర్జాతీయ వేదిక పై ఆర్ఆర్ఆర్ ప్రయాణానికి రాజమౌళి అందించిన అపారమైన సహకారాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే తన తదుపరి సినిమా ద్వారా మరింత పేరు ప్రఖ్యాతలు, ప్రశంసలు అందుకుంటారని ఆశిస్తున్నాం.