టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ పేట్రియాటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆర్ఆర్ఆర్. 2022 లో రిలీజ్ అయి అతి పెద్ద విజయం అందుకున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీంగా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు.
ఇద్దరూ కూడా తమ పాత్రల్లో అత్యద్భుత పెర్ఫార్మన్స్ లతో ఇద్దరు ఎంతో ఆకట్టుకున్నారు. ఇక ఇటీవల ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా లభించింది. విషయం ఏమిటంటే, తాజాగా ఆర్ఆర్ ఆర్ మూవ్ యొక్క డాక్యుమెంటరీని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మూవీ టీమ్.
ఆర్ఆర్ఆర్ బెహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో నేడు దీనికి సంబందించిన ట్రైలర్ ని రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ఈ డాక్యుమెంటరీని ఎంపిక చేయబడ్డ థియేటర్స్ లో మాత్రమే డిసెంబర్ 20న ప్రదర్శించనున్నారు. అలానే ఈ డాక్యుమెంటరీ ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ డాక్యుమెంటరీ ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.