Homeసినిమా వార్తలుRRR - KGF 2: కేజీఎఫ్ 2ను క్రాస్ చేసి ఆల్ టైమ్ టాప్ 3...

RRR – KGF 2: కేజీఎఫ్ 2ను క్రాస్ చేసి ఆల్ టైమ్ టాప్ 3 బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్

- Advertisement -

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు దాదాపు ఒకే సమయంలో విడుదల కాగా ఆ సమయంలో కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 1150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయగా, కేజీఎఫ్ 2 ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కేజీఎఫ్ 2 సినిమా భారీ విజయం సాధించడంతో ఆ కాస్త తేడాని జపాన్ లో రిలీజైన తర్వాత కూడా ఆర్ ఆర్ ఆర్ దాటుతుందని, ఈ స్థాయి వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఊహించలేదు.

కానీ జపాన్ కలెక్షన్స్ తో ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ 2 మూవీ ఫైనల్ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. ఇప్పటివరకు జపాన్ లో 60 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఆర్ఆర్ఆర్.. దంగల్, బాహుబలి 2 తర్వాత ఇండియన్ సినిమాల్లో ఆల్ టైమ్ టాప్-3 గ్రాసర్ గా నిలిచింది. చైనా కలెక్షన్లను మినహాయిస్తే టాప్ 2 గ్రాసర్ సినిమాలు రాజమౌళివే కావడం గమనార్హం.

నిజానికి ఆర్ఆర్ఆర్ జపాన్ లో విడుదలైనప్పుడు జపనీస్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు, మరి కొందరు ఆర్ఆర్ఆర్ సినిమాని జపాన్లో విడుదల చేయడం వల్ల సమయం వృధా అని కూడా వ్యాఖ్యానించారు. కానీ అందరి అంచనాలను మించి ప్రదర్శించబడిన ఆర్ ఆర్ ఆర్ కేజీఎఫ్ 2 కలెక్షన్లను క్రాస్ చేసింది.

READ  Baahubali 2: బాహుబలిని ఆస్కార్ కోసం అప్లై చేయలేదని తెలిపిన నిర్మాత

ఈ రెండు చిత్రాలు భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు రెండు చిత్రాల దర్శకుకైన ప్రశాంత్ నీల్, ఎస్.ఎస్.రాజమౌళిల కృషిని, విజన్ ని అందరూ ప్రశంసించారు. కాగా ఐఎండీబీ 2022లో అత్యధికంగా వీక్షించిన 10 భారతీయ చిత్రాల జాబితాలో ఈ రెండు చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories