రాజమౌళి తెరకెక్కించిన RRR జపాన్‌లో సంచలనం సృష్టిస్తుంది. ఈ చిత్రం జపనీస్ బాక్సాఫీస్ వద్ద భారతీయ చిత్రాలలో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పైగా మరో రెండు మూడు వారాల్లో ముత్తు సినిమా వసూళ్లను కూడా అధిగమించి అత్యున్నత స్థాయికి ఎగబాకబోతుంది.
దర్శకధీరుడు రాజమౌళి తన ఆయుధాలుగా తయారు చేసిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లతో కలిసి సాధించిన భారీ మరియు అరుదైన ఘనత ఇది. కాగా ఈ చిత్రం కోసం ఈ ఇద్దరు స్టార్ హీరోలు కఠినమైన శారీరక పరివర్తనకు గురయ్యారు, అందువల్ల యాక్షన్ సన్నివేశాలలో చురుకైన విధంగా కనిపించడంతో అది సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది.
RRR జపాన్ లో ఇప్పటికే ₹ 20 కోట్లు వసూలు చేసింది మరియు రెండు రోజుల్లో 2.5 మిలియన్ డాలర్లు దాటవచ్చు. భారతీయ చిత్రాలలో ముత్తు అత్యధిక వసూళ్లు రాబట్టి నంబర్ వన్ స్థానంలో ఉంది మరియు RRR ఖచ్చితంగా దానిని కూడా త్వరలోనే అధిగమిస్తుంది.
భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే దృక్పథం రాజమౌళికి ఎప్పుడూ ఉండేది. కాగా జపాన్‌లో బాహుబలిని కూడా ప్రమోట్ చేయడానికి ప్రయత్నించారు, అది భారీ స్థాయిలో కాకపోయినా బాగానే ఫలితాన్ని ఇచ్చింది.
కానీ RRR బృందం మాత్రం జపనీస్ మార్కెట్‌ను మరింత సీరియస్‌గా తీసుకుంది. అంతే కాక జపాన్‌కు వెళ్లి అక్కడ మీడియాను కలవడం ద్వారా సినిమాని ప్రమోట్ చేయడానికి తమ శాయశక్తులా ప్రయత్నించింది.
తత్ఫలితంగా RRR జపాన్‌లో వివిధ మీమ్స్, చర్చలు, ఫ్యాన్ ఆర్ట్స్ మొదలైనవాటిని ప్రేరేపించడంతో సంచలనంగా మారింది. ఈ చిత్రం బలమైన బ్రిటిష్ వ్యతిరేక ఇతివృత్తాన్ని కలిగి ఉన్నందున, ఇది అమెరికా మరియు జపాన్‌లలో సంచలనంగా మారింది.
రాజమౌళి ప్రతి సినిమాతో అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ మాస్టర్ స్టోరీటెల్లర్ మహేష్ బాబుతో తన తదుపరి సినిమా కోసం తన అమ్ములపొదిలో ఏ అస్త్రాలను దాచి ఉంచాడో చూడటం కోసం ప్రేక్షకులు మరింత ఆసక్తికరంగా వేచి ఉంటారు.