కోలీవుడ్ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నారు. ఏ మూవీ ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటుంది. అనిరుద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుండగా శృతిహాసన్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఈ ఏడా చివర్లో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక దీని అనంతరం కార్తీతో ఖైదీ 2 మూవీనైతే ప్రారంభించనున్నారు లోకేష్. అలానే దాని తర్వాత బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ తో కూడా ఆయన ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా లేటెస్ట్ కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఖైదీ 2 అనంతరం రోలెక్స్ మూవీని లోకేష్ ప్రారంభిస్తారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి/ వాస్తవానికి విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో కొన్ని నిమిషాల పాటు ఉండే రోలెక్స్ పాత్రకి అందరి నుంచి విశేషమైన రెస్పాన్స్ లభించింది.
మరోవైపు రోలెక్స్ సినిమాని త్వరగా పట్టాలెక్కించి, అనంతరం వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వారు సన్నాహాలు చేస్తున్నారట. ఖైదీ 2 అనంతరం లోకేష్ పక్కాగా రోలెక్స్ మూవీనే ప్రారంభిస్తారా లేదా అనే న్యూస్ ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలి అంటే దీనికి సంబంధించి ఆ మూవీ టీమ్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.