ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదో ఒక వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఎలక్షన్ల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ ల ఒక మార్ఫింగ్ ఫోటోని తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్లో అప్లోడ్ చేశారు వర్మ. అయితే ఆ విషయమై ఇటీవల వర్మ పై ఒక కేసు నమోదయింది. దానితో వర్మని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లడం జరిగింది.
ఆయన ఇంట్లో లేరని ప్రస్తుతం పలు షూటింగ్స్ పనుల విషయంలో బిజీగా ఉన్నారని ఆయన టీం చెప్పడం జరిగింది. ఇక సడన్ గా తాజాగా పలు మీడియా ఛానల్స్ లో ప్రత్యక్షమైన వర్మ తాను ఎక్కడికి వెళ్లలేదని తాను ఎవరికి భయపడలేదని అంటూ నిన్న లైవ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కావాలనే తనని టార్గెట్ చేస్తున్నారని అప్పట్లో తాను పెట్టిన పోస్ట్ ఏంటో కూడా తన గుర్తులేదని, అయితే దానిని ఇప్పుడు బయటికి తీసి ప్రత్యేకంగా కావాలని కక్షగట్టి తనపై కంప్లైంట్స్ పెట్టడం కరెక్ట్ కాదనేది వర్మ వాదన.
అటువంటి మార్పింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వేలాదిగా వస్తూ ఉంటాయని వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఆయన ధ్వజమెత్తుతున్నారు. మరి మొత్తంగా వర్మ తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నారని అంటున్నాయి సినీ వర్గాలు. మరి ఆయన కేసు ఇకపై ఎటువంటి మలుపులు తిరుగుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వరకు వెయిట్ చేయాలి.