నటి మరియు పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అయితే గత కొద్ది కాలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆమె ఖండించటం అనేది సర్వ సాధారణంగా జరుగుతూ వస్తుంది. అయితే తాజాగా ఆమె తన బాధను కాస్త తీవ్రంగానే వ్యక్తం చేశారు.
రేణూ దేశాయ్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఇలా రాశాడు.మేడం ఇది చాలా అన్యాయం.. మా అకిరాను ఒకసారి అయినా చూపించండి.. మా అన్న కొడుకుని చూడాలని ఉంటుంది మాకు.. మీరు ఇలా హైడ్ చేయకండి.. అప్పుడప్పుడు అయినా వీడియోలో అకిరా బాబుని చూపించండి అని రేణూ దేశాయ్‌ని అభ్యర్థించారు. కానీ రేణూ దేశాయ్‌కి ఈ కామెంట్ ఏమాత్రం నచ్చలేదు.
మీ అన్న(పవన్ కళ్యాణ్) కొడుకా అని రిప్లై ఇచ్చింది??? అకీరా నా అబ్బాయ్. మీరూ ఒక పుట్టలేదా? నేను మీ సందేశాలను చాలావరకు విస్మరిస్తూనే ఉన్నాను. మీరు పవన్ హార్డ్ కోర్ అభిమానులు అని నేను అర్థం చేసుకున్నాను, కానీ మీరు నమ్మకానికి మించి సున్నితత్వం లేని వాళ్ళలా ఉన్నారు.
అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమాని పెట్టిన పోస్టు కాస్త అత్యుత్సాహంతో అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అకీరా కేవలం పవన్ కొడుకేనని అర్థం వచ్చేలా చేసిన తన వ్యాఖ్య రేణుకు కోపం తెప్పించినట్లుంది. దాంతో ఆమె అతని పై ఫుల్ పవర్ తో ఎదురుదాడికి దిగారు. అకీరాను పవన్ కొడుకుగా మాత్రమే పిలుస్తారు కాబట్టే ఆమె స్పందించిన విధానంలో కాస్త స్త్రీవాదం ఉందని అర్థం చేసుకోవచ్చు.
అంతే కాదు రేణు స్పందన కేవలం ఒక పోస్ట్ కు మాత్రమే కాదని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అభిమానుల నిరంతర సందేశాల కారణంగా ఏర్పడిన నిరాశ ఫలితమే ఆమె పోస్ట్ అని స్పష్టమవుతోంది. రేణు పోస్ట్ స్వభావం ఇదే విషయాన్ని స్పష్టంగా రుజువు చేస్తోంది.
నిజానికి తాను ఇలాంటి కామెంట్లను పట్టించుకోకుండా, డిలీట్ చేస్తూ, బ్లాక్ చేస్తూనే ఉంటానని, కానీ ఈ రోజు తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఈ ఇన్ సెన్సిటివ్ కామెంట్ చదవడం తనను బాధించిందని రేణు దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు.