Homeసినిమా వార్తలుమిశ్రమ స్పందన తెచ్చుకున్న ప్రభాస్ ఆదిపురుష్ ఫస్ట్ లుక్

మిశ్రమ స్పందన తెచ్చుకున్న ప్రభాస్ ఆదిపురుష్ ఫస్ట్ లుక్

- Advertisement -

కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా భారతదేశ సినీ ప్రేక్షకులు అందరూ ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా `ఆదిపురుష్`. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ లేదా టీజర్ ఇలా ఏదో ఒక అప్ డేట్ కోసం చాలా రోజులుగా ఆసక్తితో ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాముడి గెటప్ లో ప్రభాస్ ఎలా ఉంటారు.. రాముడిగా అందరినీ మెప్పిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

కాగా ఈ చిత్రం టీజర్ అక్టోబర్ రెండో తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక టీజర్ కి ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే అభిమానులకు ఓం రౌత్ టీజర్ రిలీజ్ తాలూకు సర్ప్రైజ్ ఇచ్చారు.

“మా ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరు భాగం కండి. ఉత్తరప్రదేశ్ రాష్ర్టం ఆయోధ్యలో సరయు నది ఒడ్డున జరగనున్న ఆదిపురుష్ టీజర్ లాంచ్ లో పాల్గొనండి. అక్టోబర్ 2 రాత్రి 7.11 గంటలకు టీజర్ విడుదల చేస్తున్నాం” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

READ  లైఫ్ ఆఫ్ ముత్తు.. శింబు - గౌతమ్ మీనన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఖరారు

ఆ రకంగా ఆదిపురుష్ చిత్రం నుంచి తొలిసారిగా ప్రభాస్ పోస్టర్ ను అధికారికంగా విడుదల చేశారు. ఎట్టకేలకు తాము ఎదురు చూసిన పోస్టర్ వచ్చినందుకు ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఆనందించారు.

రాముడి ఆహార్యం కోసం వినియోగించిన కాస్ట్యూమ్స్ అవీ బాగున్నా.. ఈ పోస్టర్ చూసిన ప్రభాస్ అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు కూడా పెదవి విరిచారు. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులకి ఈ లుక్ ఏమాత్రం నచ్చలేదు. అయితే ఇది కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ కాబట్టి, ఎల్లుండి వచ్చే టీజర్ తో ఆదిపురుష్ చిత్ర బృందం ప్రేక్షకులని ఆకట్టుకునే అవకాశం లేకపోలేదని మరి కొందరు అంటున్నారు. మరి టీజర్ తో నిజంగానే ఆదిపురుష్ టీమ్ అందరినీ ఆకట్టుకుంటారు అని ఆశిద్దాం.

READ  ఆదిపురుష్ టీమ్ పై ఆగ్రహంతో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్

ఆదిపురుష్ చిత్రాన్ని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాముడిగా.. ఆయనకు జోడీగా కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్నారు. రావణాసురిడి పాత్రలో సైఫ్ అలీఖాన్..లక్ష్మణుడి పాత్రలో సన్నీసింగ్ నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories