టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ తీస్తున్న పుష్ప 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న ఈ మూవీ డిసెంబర్ 6న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.
అయితే దీని అనంతరం అల్లు అర్జున్ ఎవరితో మూవీ చేస్తారు అనేది కొన్నాళ్లుగా అందరిలో ఆసక్తికరంగా మారింది. నిజానికి హారికా హాసిని, గీత ఆర్ట్స్ సంయుక్తంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ చేయనున్నారని ఇటీవల అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే అది కొన్నాళ్ల పాటు వాయిదా పడిందని, త్రివిక్రమ్ స్థానంలో జవాన్ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ చేయనున్నారని కొన్నాళ్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
కాగా మాకు అందిన సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, పక్కాగా పుష్ప 2 అనంతరం త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ తదుపరి చేయడం ఫిక్స్ అనేది వెల్లడైంది. కాగా ఆ మూవీ ఎంతో భారీ స్థాయిలో సోసియో ఫాంటసీ జానర్ లో రూపొందనున్నట్లు టాక్.