Homeసినిమా వార్తలుRC 16 Shooting in Fast Phase ​శరవేగంగా RC 16 షూటింగ్

RC 16 Shooting in Fast Phase ​శరవేగంగా RC 16 షూటింగ్

- Advertisement -

​ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ చేంజర్ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా కీలకపాత్రల్లో ఎస్ జె సూర్య, అంజలి, సునీల్, బ్రహ్మానందం, సముద్రఖని, శ్రీకాంత్ నటించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అనంతరం అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. 

ఇక దీని తరువాత ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనతో చరణ్ చేస్తున్న సినిమా RC16. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకునే కథ కథనాలతో రూపొందుతున్న ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, సంస్థలతో కలిసి తన వృద్ధి సినిమాస్ సంస్థపై యువ నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే విషయం ఏమిటంటే ఎక్కువ బ్రేకులు లేకుండా ఈ మూవీ యొక్క షూట్ ని దర్శకుడు బుచ్చిబాబు లాగించేస్తున్నారట. అలానే ఇందులో పెద్దగా విఎఫ్ఎక్స్ కు సంబంధించిన సీన్స్ కూడా ఉండవని, ఉన్న కొద్దిపాటి విఎఫ్ఎక్స్ సీన్స్ ని కూడా షూటింగ్ తో పాటు వేగంగా చేయిస్తున్నారట. 

READ  Lucky Bhaskar All Time Record in Netflix లక్కీ భాస్కర్ : నెట్ ఫ్లిక్స్ లో ఆల్ టైం రికార్డు

అలానే ఈ ఏడాదే మూవీని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట దర్శకుడు బుచ్చి బాబు. కాగా రంగస్థలం తర్వాత ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర మరింత అద్భుతంగా ఉండడంతో పాటు దీని గురించి అందరూ మాట్లాడుకుంటారని టాక్.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories