Homeసినిమా వార్తలుRC-15: మరోసారి అచ్చొచ్చిన కథతో రానున్న శంకర్

RC-15: మరోసారి అచ్చొచ్చిన కథతో రానున్న శంకర్

- Advertisement -

ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ విజయం తరువాత అనుకోని విధంగా ఆచార్య లాంటి ఘోర పరాజయం చవిచూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రం సౌత్ ఇండియా గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన శంకర్ తోచేస్తున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ‌‌తో కలిసి చేసిన ఆర్ ఆర్ ఆర్ తో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు తన తండ్రి చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయినా, ఆత్మ విశ్వాసంతో మళ్ళీ భారీ విజయం సాధించే ప్రయత్నం మొదలు పెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆర్ ఆర్ ఆర్, ఆచార్య రెండు సినిమాలూ మల్టీ స్టారర్లే.

ఇక శంకర్ ఒక తెలుగు హీరోతో సినిమా చేయడం ఇదే మొదటిసారి.అలాగే చరణ్ కూడా తోలిసారి తమిళ దర్శకుడితో కలిసి పని చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. రామ్ చరణ్.. తండ్రి.. ఇద్దరు కుమారులుగా నటించబోతున్నట్టు పలు రకాల పుకార్లు షికార్లు చేశాయి.

READ  కాంచన చంద్రముఖి ని మరిపిస్తుందా?

ఆ వార్తలు ఎంత నిజమో తెలియదు కానీ ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ సినిమాలో తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. నెగటివ్ పాత్రలలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.రామ్ చరణ్ – శంకర్ సినిమాలో ఎస్ జే సూర్య ఒక స్వార్థపరుడైన రాజకీయ నాయకుడి పాత్రలో కనిపిస్తారట. ముఖ్యమంత్రి కొడుకుగా.. జీవితంలో భారీ ఆశలు ఉన్న వ్యక్తిగా, తన దరికి అడ్డు వస్తే ఎంత దూరం అయినా వెళ్ళే పాత్రగా చెప్తున్నారు. ఇక ఆ పాత్రకు ఎదురుపడే ఒక నిజాయతీ గల ఐఏఎస్ అధికారి పాత్రలో హీరో రామ్ చరణ్ కనిపించబోతున్నారట.

సమాజంలో జరిగే అవినీతిని హీరో అరికట్టడం అనేది శంకర్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే అంశం. అలాంటి కథలు, పాత్రలు ఎంచుకున్నప్పుడే ఆయన ఎక్కువగా విజయం సాధించారు. గత రెండు చిత్రాలలో కథ కంటే గ్రాఫిక్స్ మరియు సాంకేతిక హంగులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ రామ్ చరణ్ తో చేసే సినిమాలో మాత్రం తనకు అచ్చొచ్చిన నేపథ్యాన్ని ఆయన ఎంచుకున్నారు. మరి ఆయన ప్రయత్నం ఫలించి సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుందాం.

READ  దేవీశ్రీ ప్రసాద్ వద్దు.. రవి బస్రూర్ యే ముద్దు అంటున్న సల్మాన్ ఖాన్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories