Homeబాక్సాఫీస్ వార్తలుDhamaka: రవితేజ ధమాకా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్

Dhamaka: రవితేజ ధమాకా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ తన సరికొత్త చిత్రం ధమాకాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు, ఈ చిత్రం 23 డిసెంబర్ 2022న అంటే రేపే విడుదల కానుంది. కాగా ప్రమోషనల్ వీడియోల ద్వారా ఈ సినిమా పై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడుతోంది. తాజా సమాచారం ఏమిటంటే ధమాకా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయింది.

ఈ చిత్రం మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్ర (6 ప్రాంతాలు) బిజినెస్ 9 కోట్లు – 10 కోట్ల నిష్పత్తిలో జరిగింది, సీడెడ్ ఏరియా 2.8 కోట్లకి అమ్ముడైంది. నైజాం హక్కులు 5 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా AP/TG హక్కులు 17 కోట్లకు చేరాయి మరియు మిగిలిన ఏరియాల విలువ 2 కోట్లు, మొత్తం మీద సినిమా బిజినెస్ 19 కోట్ల వరకూ ఉంటుంది.

ధమాకా హిట్ స్టేటస్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాలి. మాస్‌ ఎంటర్‌టైనర్‌ కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ వస్తే ఈజీగా ఈ చిత్రం కావాల్సిన వసూళ్లు రాబట్టవచ్చు.

READ  మసూదా మొదటి వారాంతం తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ కలెక్షన్లు

త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో దూసుకువస్తున్న యువ నటి శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.

ధమాకా ట్రైలర్, టీజర్, మరియు పాటలు సినిమా పై చక్కని పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

రవితేజకి కూడా బాక్సాఫీస్ వద్ద తగిన హిట్ కావాలి, ఎందుకంటే ఆయన నటించిన మునుపటి సినిమాలు రామారావు ఆన్ డ్యూటీ మరియు ఖిలాడి బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి, ఈ చిత్రంతో మాస్ మహారాజా మళ్లీ హిట్ ట్రాక్‌లోకి రావాలని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp

READ  జపాన్ బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల మార్కును దాటిన RRR


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories