టాలీవుడ్ నటుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ మూవీ ద్వారా లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకి వచ్చారు. నూతన నటి భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా కీలక పాత్రల్లో జగపతి బాబు, అన్నపూర్ణమ్మ, సత్య తదితరులు నటించారు. మొదటి నుండి అందరి నుండి మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం దిశగా ప్రస్తుతం కొనసాగుతోంది.
బాలీవూడ్ యాక్షన్ మూవీ ది రెయిడ్ కి అఫీషయల్ రీమేక్ గా దీనిని హరీష్ శంకర్ తెరకెక్కించారు. అయితే గతంలో పవన్ తో గబ్బర్ సింగ్ వంటి రీమేక్ ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్న హరీష్, ఇప్పుడు మిస్టర్ బచ్చన్ విషయంలో తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. పేలవమైన కథ కథనాలతో మూవీ తీసిన హరీష్, ఎక్కువగా హీరోయిన్ పైనే సినిమాలో దృష్టి పెట్టారు. మరోవైపు ఇటీవల కెరీర్ పరంగా వరుస పరాజయాలు చవిచూస్తున్న రవితేజకు ఇది మరొక చేదు జ్ఞాపకాన్ని మిగిలించింది. వరుసగా రవితేజ నుండి డిజాస్టర్స్ వస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ ఎంతో ఢీలా పడుతూ ఇకనైనా కళ్ళు తెరిచి సరైన కథలు ఎంచుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి రవితేజ మూవీస్ కి జరిగే బిజినెస్ కంటే ఆయన తీసుకునే రెమ్యునరేషన్ చాలా ఎక్కువ. తద్వారా వచ్చే కలెక్షన్స్ కి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కి చాలా నష్టాలు వస్తున్నాయి. కావున రాబోయే సినిమాల విషయంలో ఇవి గుర్తుపెట్టుకుని కెరీర్ పరంగా సాగితే బాగుంటుంది. మరి మాస్ మహారాజా నుండి ఇకనైనా మంచి సినిమాలు వస్తాయని ఆశిద్దాం.