Homeసినిమా వార్తలుRashmika: పుష్ప 2 లో రష్మిక మందన్నకు స్క్రీన్ టైమ్ చాలా తక్కువ

Rashmika: పుష్ప 2 లో రష్మిక మందన్నకు స్క్రీన్ టైమ్ చాలా తక్కువ

- Advertisement -

అల్లు అర్జున్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప ఫస్ట్ పార్ట్ హీరోయిన్ రష్మిక మందన్నకు విపరీతమైన క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమెకు మంచి స్క్రీన్ టైం లభించడంతో పాటు శ్రీవల్లి, పుష్పల లవ్ ట్రాక్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. పుష్ప సినిమా తర్వాత ప్రేక్షకులు రష్మికను శ్రీవల్లి అని పిలవడం మొదలు పెట్టారు.

హీరోయిన్ కు సంబంధించిన ఎమోషనల్ సీన్స్, సాంగ్స్ పుష్పకు చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. భారీ స్థాయిలో వైరల్ హిట్ అయిన శ్రీవల్లి పాట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే పార్ట్ 2లో మాత్రం రష్మిక పాత్రకు స్క్రీన్ టైమ్ చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రధానంగా ఇతర పాత్రల చుట్టూ మాస్ యాక్షన్ సీక్వెన్స్ లు, ట్విస్ట్ లు ఉంటాయని అంటున్నారు.

హీరోయిన్ గా రష్మిక మందన్నకు విపరీతమైన క్రేజ్ ఉంది. నేషనల్ క్రష్ అని పిలుచుకునే రష్మిక మందన్న పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. కన్నడకు చెందిన ఓ వర్గం నెటిజన్లు రష్మిక పై ద్వేషాన్ని వ్యాపింపజేశారు. బయటి వ్యక్తిలా ఆమెను దూరం పెట్టారు. కాంతార చిత్రం గురించి మాట్లాడనందుకు ఆమె పై అనేక మీమ్స్, ట్రోల్స్ చేశారు. దీంతో రష్మిక గతంలో ఆమె పైన ఉన్న వివక్షకు వ్యతిరేకంగా బహిరంగ లేఖ రాసారు.

READ  Waltair Veerayya: కొరటాల శివకి థాంక్స్ చెప్పిన వాల్తేరు వీరయ్య దర్శకుడు

అలాగే, తన బాలీవుడ్ చిత్రం మిషన్ మజ్ను ప్రమోషన్ సందర్భంగా ఆమె సౌత్ ఇండియన్ సినిమా సాంగ్స్ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. రష్మిక నెటిజన్లు తన పై నిరంతరం వేధింపులు, ట్రోల్స్ జరుగుతున్నప్పటికీ ఆమె తన పనిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆమె తన కెరీర్ లో ఇలాగే విజయవంతంగా కొనసాగించాలని కోరుకుందాం.

ఇదిలా ఉంటే ఆమె తదుపరి చిత్రం పుష్ప ది రూల్ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలో పుష్ప ఎదుగుదలను మరింత ఎత్తుకు తీసుకెళ్తారట. ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ లు మరో లెవల్ లో తలపడతారని అంటున్నారు. మొదటి భాగంలో తాము పోషించిన పాత్రలలోనే రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కనిపిస్తారు. మైత్రీ మూవీస్ ఈ చిత్రానికి నిర్మాణ భాధ్యత వహిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Balakrishna: నర్సుల పై వ్యాఖ్యలతో కొత్త వివాదం లో చిక్కుకున్న బాలకృష్ణ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories