Homeసినిమా వార్తలునన్ను కన్నడ పరిశ్రమ బ్యాన్ చేయలేదని చెప్పిన రష్మిక మందన్న

నన్ను కన్నడ పరిశ్రమ బ్యాన్ చేయలేదని చెప్పిన రష్మిక మందన్న

- Advertisement -

రష్మిక మందన్న కెరీర్ ప్రస్తుతం అద్భుతమైన దశలో ఉన్నారు. ఆమె దక్షిణ చిత్ర పరిశ్రమలో ఉత్తమ మరియు ప్రముఖ నటీమణులలో ఒకరు. అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బై చిత్రంతో ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అయితే ఆ సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

వృత్తిపరంగా ఆమె అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నప్పటికీ, వివాదాలను ఆమెను ఒంటరిగా విడిచిపెట్టేటట్లు అనిపించడం లేదు. విజయ్ దేవరకొండతో ఎఫైర్ మొదలుకొని కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి బ్యాన్ కు గురికావడం వరకు ఎన్నో వివాదాల్లో రష్మిక చిక్కుకున్నారు.

రిషబ్ శెట్టి నటించిన కాంతార పై రష్మిక మందన్న ఇటీవలే చేసిన వ్యాఖ్య కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఆ క్రమంలోనే రష్మిక మందన్నను కన్నడ చిత్ర పరిశ్రమ నిషేధించినట్లు వార్తలు కూడా వచ్చాయి.

కొన్ని వారాల క్రితం జరిగిన వివాదం కారణంగా ఇదంతా జరిగింది. రిషబ్ శెట్టి నటించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన చిత్రం కాంతార సినిమాని చూశారా అని రష్మిక మందన్నను ఒక ఇంటర్వ్యూలో అడిగారు. ఆమె అందుకు లేదు అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె మాతృభూమి అయిన కన్నడ చిత్ర పరిశ్రమ పట్ల రష్మికకు గౌరవం లేదని కొంతమంది అభిమానులు కోపానికి గురి కావడంతో ఇది వివాదంగా మారింది.

కాంతార సినిమా చూడకపోవడం వల్ల ఆమె చాలా మందిని కలవరపెట్టడంతో ఆమె కన్నడ చిత్ర పరిశ్రమ నుండి నిషేధించబడుతుందని పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు రష్మిక మందన్న ఈ చర్చపై క్లారిటీ ఇచ్చారు.

READ  కాంతార ఓటీటీ రిలీజ్ ను వాయిదా వేయనున్న నిర్మాతలు

ఇటీవల మీడియా సమావేశంలో రష్మిక మందన్న తన పై వస్తున్న ట్రోల్స్, కాంతార వివాదం, పరిశ్రమ నుండి నిషేధం గురించి మాట్లాడారు. తనను ట్రోల్ చేసే వారిపై తనకు ప్రేమ తప్ప మరేమీ లేదని ఆమె పేర్కొంది.

కాంతార పై రగిలిన వివాదం గురించి మాట్లాడుతూ.. కాంతార చిత్రం విడుదలై రెండు రోజులైన తర్వాత తనని ఆ సినిమా చూశారా అని అడగగా.. అప్పటికి తను చూడలేదు అని తను బదులు ఇచ్చినట్లుగా రష్మిక తెలిపారు. ఇక తను తరువాత, కాంతార చిత్రాన్ని చూసినట్లు మరియు దాని గురించి బృందానికి సందేశం కూడా పంపినట్లు రష్మిక తెలిపారు.

అంతే కాకుండా కాంతార చిత్ర బృందం నుండి తాను కృతజ్ఞతలు అందుకున్నట్లు రష్మిక పేర్కొన్నారు. పరిశ్రమలో ఏమి జరుగుతుందో ప్రజలకు తెలియదని, ప్రతి దానికీ సోషల్ మీడియాలో సందేశాలను పంచుకునే వారిలో తాను లేనని రష్మిక మందన్న పేర్కొన్నారు.

కన్నడ చిత్ర పరిశ్రమ నుండి నిషేధాన్ని ఎదుర్కోవడం గురించి మాట్లాడుతూ, “ఇప్పటివరకు నన్ను ఎవరూ నిషేధించలేదు” అని ఆమె అన్నారు. రష్మిక మందన్న నుండి వచ్చిన ఈ వివరణ ఆమె పై వస్తున్న అన్ని పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతుందని ఆశిస్తున్నాము.

READ  వంశీ పైడిపల్లితో బడ్జెట్ కంట్రోల్ లో పెట్టించడంలో విఫలమవుతున్న దిల్ రాజు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories