అక్కినేని నాగార్జున, ధనుష్ ల తొలి క్రేజీ కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థల పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ భారీ పాన్ ఇండియన్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న కుబేర నుండి నేడు హీరోయిన్ రష్మిక మందన్న ఫస్ట్ లుక్ గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేసారు మేకర్స్. ఒక ప్రాంతంలో పాతిపెట్టబడి ఉన్న డబ్బుల బ్యాగ్ ని రష్మిక తవ్విస్తున్న ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.
నికేత్ బొమ్మి ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ధనుష్, నాగార్జున ల ఫస్ట్ గ్లింప్స్ టీజర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. కాగా కుబేర మూవీ యొక్క బ్యాలెన్స్ షూట్ ని వేగవంతంగా పూర్తి చేసి వీలైనంత త్వరలో మూవీని పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.