Homeసినిమా వార్తలుభారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న రష్మిక మందన్న

భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న రష్మిక మందన్న

- Advertisement -

పుష్ప: ది రైజ్ వంటి భారీ ప్యాన్ ఇండియా ఘనవిజయం తర్వాత, రష్మిక మందన్న పేరు ఒక్కసారిగా భారతదేశం అంతటా పాపులార్ అయిపోయింది. దీంతో ఆమె ఇమేజ్ కూడా చాలా ఎత్తుకు ఎదిగింది. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్రలో ఆమె చేసిన నటన కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలోని ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక పుష్ప తర్వాత, రష్మికకు అన్ని పరిశ్రమల నుండి భారీ ఆఫర్లు రావడం ప్రారంభించాయి. ఆమె ఇప్పటికే అమితాబ్ బచ్చన్‌తో గుడ్‌బై అనే నటించారు, అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఇటీవలే రణబీర్ కపూర్‌తో ఒక చిత్రానికి కూడా సంతకం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ చిత్రానికి దర్శకుడు మరెవరో కాదు.. అర్జున్ రెడ్డి వంటి సినిమాతో ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా పరిణీతి చోప్రాను అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో రష్మిక వచ్చి చేరారు. ఇక ఈ చిత్రంలో అనిల్ కపూర్ కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.

ఇక తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలు అన్నిట్లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన తరువాత సహజంగానే, రష్మిక రాబోయే ప్యాన్ – ఇండియన్ చిత్రాలకు తన రెమ్యునరేషన్ పెంచాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆమె ఇకపై తన పాత రెమ్యూనరేషన్‌ ను కొనసాగించకుండా, ఏకంగా 5 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారట.

READ  లైగర్ దెబ్బతో పూరి కనెక్ట్స్ కథ ముగిసినట్లేనా?

5 కోట్లు అనేది ఎంతటి భారీ ఇమేజ్ ఉన్న స్టార్ కి అయినా చాలా పెద్ద మొత్తమనే చెప్పాలి. కేవలం అమౌంట్ పెంచడం మాత్రమే కాకుండా రష్మిక తన రెమ్యునరేషన్‌కు అనుగుణంగా తన ప్రతిభను ప్రదర్శించాల్సి వస్తుంది. ఆమె ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పరచుకున్న అతిపెద్ద పాన్-ఇండియన్ చిత్రం పుష్ప: ది రూల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రేక్షకులలో చాలా ఉత్కంఠ మరియు హైప్ నెలకొంది.

కాగా ఈ చిత్రం షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. షూటింగ్ అధికారికంగా ప్రారంభమైందని, పార్ట్ 2 కోసం టీమ్ అంతా ఉత్సాహంగా ఉన్నారని రష్మిక ధృవీకరించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి మధ్య గొడవకు దారి తీసిన అల్లు అర్జున్ ట్వీట్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories