Homeసినిమా వార్తలుRanga Marthanda: రంగమార్తాండ థియేట్రికల్ రైట్స్ ను మంచి ధరకు కొనుగోలు చేసిన మైత్రీ మూవీస్

Ranga Marthanda: రంగమార్తాండ థియేట్రికల్ రైట్స్ ను మంచి ధరకు కొనుగోలు చేసిన మైత్రీ మూవీస్

- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా తెరకెక్కించిన రంగమార్తాండ సినిమా ఈ ఉగాదికి విడుదలకు సిద్ధమవుతోంది. తన గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో బోల్తాకొట్టడంతో ఈ ప్రాజెక్ట్ పై దర్శకుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

కాగా తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూ.4 కోట్లకు దక్కించుకుందని తెలుస్తోంది. ఇటీవలే మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

మార్చి 22న విడుదల కానున్న ఈ చిత్రం 2016లో విడుదలైన మరాఠీ బ్లాక్ బస్టర్ నటసామ్రాట్ కు అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ చిత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన సమీక్షలతో పాటు ఆదరణను పొందింది మరియు ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన మరాఠీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

రంగస్థలం నుంచి రిటైర్ అయినా నాటకరంగం, రంగస్థలం పట్ల తనకున్న మధుర స్మృతులను మరచిపోలేని రంగస్థల నటుడి విషాద కుటుంబ జీవితాన్ని రంగమార్తాండ చిత్రిస్తుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. రాజా శ్యామల ఎంటర్టైన్మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. కాగా ఇటీవలే తెలుగు సినిమా పరిశ్రమలోని సభ్యుల కోసం నిర్వహించిన స్పెషల్ ప్రీమియర్స్ కు మంచి స్పందన రావడంతో ఇప్పుడు అందరి చూపు మార్చి 22 మీద పడింది.

READ  Megastar Chiranjeevi: ఆర్ ఆర్ ఆర్ పై చేసిన ట్వీట్‌తో ఎన్టీఆర్ అభిమానులను మళ్లీ బాధపెట్టిన మెగాస్టార్ చిరంజీవి

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories