గత వారం లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత, ఈరోజు రెండు కొత్త తెలుగు సినిమాలు పెద్ద తెరపైకి వచ్చాయి. మొదటిది ఫస్ట్ డే ఫస్ట్ షో, ఈ చిత్రానికి జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కెవి కథ అందించారు. ఇక రెండో సినిమా వైష్ణవ్ తేజ్ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రంగ రంగ వైభవంగా.రెండు చిత్రాల ప్రీమియర్ షోల నుండి పబ్లిక్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.
ఫస్ట్ డే ఫస్ట్ షో చాలా విషయాలను జొప్పించటానికి ప్రయత్నించినప్పటికీ సినిమా తీరు ప్రేక్షకులకు విసుగు పుట్టించేలా తయారైంది. జాతి రత్నాలు సినిమాలో లాగానే కామెడీతో మ్యాజిక్ చేసే ప్రయత్నం జరిగింది కానీ ఆ ప్రయత్నంలో చిత్ర బృందం అన్ని రకాలుగా ఘోరంగా విఫలమైంది.
ప్రేక్షకులను నవ్వించే లేదా అలరించే ఏ ఒక్క సన్నివేశం కూడా లేదని వాపోయారు. అనుదీప్ కథ రాసినప్పటికీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది వంశీదర్ గౌడ్, లక్ష్మీనారాయణ. జాతి రత్నాలు సినిమా నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి వంటి ప్రతిభావంతమైన నటుల వల్ల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అలాంటి ఆకట్టుకునే మాయాజాలం ప్రదర్శించడంలో విఫలమైంది.
ఇక రంగ రంగ వైభవంగా సినిమా కూడా పెద్దగా గొప్ప టాక్ తెచ్చుకోలేదు. సినిమాలో ఫస్టాప్ వరకూ హీరో – హీరోయిన్ల మధ్య చిలిపి గొడవలు చూపిస్తూ కాస్త సరదాగా సాగినా.. సెకండాఫ్ కి వచ్చేసరికి ఎమోషనల్ సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఏ క్షణంలో కూడా పాత్రలతో, సినిమాతో ప్రేక్షకులు కనెక్ట్ అవకుండా ఉన్న ఈ సినిమా కూడా డిజాస్టర్ దిశగా పయనిస్తోందనే చెప్పాలి.
ఓవరాల్‌గా, ఈ రోజు విడుదలైన రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల పై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి. అసలు రెండు సినిమాలు విడుదలైన సందడి కూడా చాలా తక్కువగా ఉంది. ఇక ఇలా నెగటివ్ టాక్ రావడంతో రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీసు వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చెప్పినట్టు కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్లకు వస్తారనే విషయం మరోసారి రుజువైంది.