యానిమల్ సినిమా కోసం రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగాతో జతకట్టినట్లు ప్రకటించినప్పటి నుండి, అభిమానులు ఆ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక హింసాత్మకమైన గ్యాంగ్‌స్టర్ కథ కోసం వారిద్దరూ చేతులు కలిపినట్లు సమాచారం.
ఇటీవల, యానిమల్ సినిమాలోని రణబీర్ కొత్త లుక్ వెబ్‌లో లీక్ అయింది. లీకైన పిక్స్‌లో, నటుడు తెల్లటి కుర్తా ధరించి రక్తపు మరకలతో కనిపించారు. రణబీర్ పొడవాటి జుట్టు, బరువైన గడ్డం మరియు అతని రక్తంతో నిండిన ముఖంపై తీవ్రమైన రూపాన్ని కలిగి ఉన్నారు. ఈ లీకైన పిక్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి మరియు రణబీర్ అభిమానులు అతని కొత్త లుక్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు.
చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న రణ్‌బీర్‌లో భారీ మార్పు వచ్చింది. యానిమల్‌తో తాను చాలా హింసాత్మక చిత్రం చేస్తానని సందీప్ వంగా ఇప్పటికే నొక్కిచెప్పారు. అదే విషయాన్ని ధృవీకరిస్తూ, లీక్ అయిన పిక్స్ హింసకు అద్దం పడుతున్నాయి.
మొదట్లో, ఈ చిత్రంలో రణబీర్ సరసన నటించేందుకు పరిణీతి చోప్రా ఎంపికైయ్యారు, కానీ ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న తర్వాత, ఆ స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నను ఎంపిక చేసుకున్నారు…
ఈ చిత్రం రణబీర్ కపూర్ యొక్క బలమైన మరియు హింసాత్మకమైన పాత్రతో నడిచే పాత్ర అని చెప్పబడుతోంది. అయితే, తన తొలి చిత్రం అర్జున్ రెడ్డికీ ఈ చిత్రానికీ పెద్దగా సారూప్యతలు ఉండవని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముందే ధృవీకరించారు.
గతంలో ఒక ఇంటర్వ్యూలో, రణబీర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి పని చేయటం గూర్చి, అలాగే యానిమల్ సినిమా గురించి వివరించారు. నటుడిగా తనకు ఈ పాత్ర చేయడం గొప్ప అవకాశం అని, తాను ఇలాంటి పాత్ర చేస్తానని ఎవరూ ఊహించరని అన్నారు. తనను ఊహించని పాత్రలో చూసేందుకు ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉన్నారని చాలా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ఈ నెల ప్రారంభంలో, రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ తల్లిదండ్రులయిన సంగతి తెలిసిందే. వారికి మొదటి బిడ్డగా ఆడపిల్ల జన్మించింది. ఇక తల్లి అయక ఆలియా భట్ ప్రసూతి విరామంలో ఉన్నారు మరియు తన బిడ్డని అపురూపంగా చూసుకుంటున్నారు. అయితే, తండ్రిగా మారినా కూడా రణబీర్ కపూర్ తన కమిట్‌మెంట్‌లను పాటిస్తూ, తన రాబోయే చిత్రం యానిమల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.